దేశీయ విమానయానానికి కూడా పాస్ ఫోర్ట్ కావాల్సిందే..! Aadhaar or passport mandatory to fly even in India

Aadhaar or passport mandatory to fly even in india

passport, asdhaar card, domestic flights, Shiv Sena,Air India,Shiv Sena MP Ravindra Gaikwad,Shiv Sena MP,Ravindra Gaikwad,Jayant Sinha,Gaikwad

A video of policemen shaving the head of a youth who was in an inter-religious relationship in Shahjahanpur has been widely circulated online.

దేశీయ విమానయానానికి కూడా పాస్ ఫోర్ట్ కావాల్సిందే..!

Posted: 04/09/2017 09:23 AM IST
Aadhaar or passport mandatory to fly even in india

కేంద్ర విమానయాన శాఖ మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో వుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై నిషేదం విధించిన నేపథ్యంలో అయన పేర్లు మార్చి వివిధ పేర్లపై టిక్కెట్ తీసుకునే ప్రయత్నం చేసి ఆ తరువాత కూడా విఫలమయ్యారు. పలు సంసదర్భాలలో ఆయన టిక్కెట్ నిషేధం విషయంలో మరికొందరు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చిన నేపథ్యంలో కేంద్ర విమనాయాన శాఖ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో వుంది.

అదేంటంటారా.. ఇకపై దేశీయ విమానంలో ప్రయాణించాలన్నా.. పాస్ పోర్ట్ త‌ప్ప‌నిస‌రి కానుంది. ఇక నుంచి దేశీయ ప్రయాణాలకు కూడా పాస్‌పోర్టు వివ‌రాలు కావాల్సిందే. అయితే పాస్ పోర్టు లేని ప్రయాణికుల కోసం మరో సౌలభ్యాన్ని కూడా కల్పించనున్నారు. పాస్ పోర్టు లేనిపక్షంలో ఆధార్ కార్డు వివరాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఇప్పటివరకు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు ఉన్నాయి. ఇకపై దేశంలో ప్రయాణించే వారిపై కూడా ఈ నిబంధనలు తెచ్చేందుకు గానూ ఈ కీలక మార్పులు చేయ‌డానికి అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మూడు లేక‌ నాలుగు నెలల్లో ఈ నిబంధ‌న‌ల‌ను అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌ ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు మ‌రికొన్ని రోజుల్లో దీనిపై ప్రజ‌ల‌ అభిప్రాయాన్ని సేక‌రించనున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. విమానాల్లో ప్రయాణిస్తూ నిబంధనలు అతిక్రమించేవారి ప‌ట్ల ఇక‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. నాలుగు స్థాయుల్లో వారు చేసిన పనిని బట్టి శిక్ష విధించాల‌ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల‌ని యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ముందస్తుగా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్ లేక‌ ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles