గైక్వాడ్ ను వీడని ఎయిరిండియా వివాదం.. రోజుకో మలుపు Air India may sue Sena for loss of Rs 15 lakh

Air india may sue shiv sena mp ravindra gaikwad for loss of rs 15 lakh

Ravindra Gaikwad, Shiv Sena, Air India, legal battle, revenue loss, Rs !5 lakh, compensation

Air India is preparing for a legal battle against him for causing revenue losses worth up to Rs 15 lakh by grounding its aircraft for 90 minutes.

గైక్వాడ్ ను వీడని ఎయిరిండియా వివాదం.. రోజుకో మలుపు

Posted: 04/09/2017 07:59 AM IST
Air india may sue shiv sena mp ravindra gaikwad for loss of rs 15 lakh

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై నిషేధాన్ని ఎత్తివేసినా.. ఆ వివాదం మాత్రం ఇంకా ముగసిపోలేదు. ఓ వైపు ఎయిరిండియా అతనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించగా, మరోవైపు ఎంపీకి మాత్రం బాగానే చేతిచమురు వదిలేలావుంది. పార్లమెంటు సెషన్స్ హాజరయ్యేందుకు చార్టర్ ప్లేన్ లో వెళ్లిన ఆయన తాను డబ్బున్న ఎంపీకి కాదని, ప్రతీసారి డబ్బులు పెట్టుకుని చర్టార్ విమానంలో రాలేనన్న తరుణంలో ఎయిరిండియా మాత్రం ఈ విషయంలో అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు.

అయితే మార్చి 23న జరిగిన వివాదం కారణంగా ఎయిర్ క్రాఫ్ట్ (ఏఐ 852)ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చిందని, అందుకు ఎంపీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు 15 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా తేల్చిచెప్పింది. గైక్వాడ్ కారణంగానే సర్వీస్ ఆలస్యమైందని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు ఆ సంస్థ సన్నద్ధమైంది. మరి ఎంపీ ఈ విషయమై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

మార్చి 23న ఈ వివాదం రేగడంతో దాదాపు రెండు వారాల పాటు గైక్వాడ్ విమానయాన నిషేధం ఎదుర్కొన్నారు. అయితే ఆయన స్వయంగా తన చేతిలో దెబ్బలు తిన్న ఎయిరిండియా మేనేజర్ కు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ ఉద్యోగసంఘాలు పెట్టినా.. పార్లమెంటులో క్షమాపణలు చెప్పడం.. ఓ లేఖను రాయడంతో అతనిపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది, అయితే గైక్వాడ్ తన మాటను నెగ్గించుకున్నారని, కావున అతనిపై నష్టపరిహారం విషయాన్ని నేరుగా కోర్టులోనే తేల్చుకునేందుకు ఎయిరిండియా సిద్దమవుతన్నట్లు వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Gaikwad  Shiv Sena  Air India  legal battle  revenue loss  Rs !5 lakh  compensation  

Other Articles