ట్రిపుల్ తలాక్ పై ఉపరాష్ట్రపతి సతీమణి సంచలన వ్యాఖ్యలు No mention of Triple Talaq in Quran

No mention of triple talaq in quran says salma ansari

Hamid Ansari, Salma Ansari, Quran, Arabic, translated Quran, Moulanas, Islamic Scholar, Triple Talaq, Muslim men, Divorce, Muslim women, Quran, Vice-president

Joining the chorus of voices against Triple Talaq, Salma Ansari noted that saying talaq thrice does not amount to anything, and further called on Muslim women to read the Quran

ట్రిపుల్ తలాక్ పై ఉపరాష్ట్రపతి సతీమణి సంచలన వ్యాఖ్యలు

Posted: 04/09/2017 10:09 AM IST
No mention of triple talaq in quran says salma ansari

ఇస్లాం మతనుసారం ట్రిపుల్ తలాక్ వర్తిస్తుందని కొందరు పత్వాలు జారే చేస్తున్న నేపథ్యంలో.. అటు ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకున్నామనే తమకు ముస్లిం మహిళలు ఓట్లు వేశారని బీజేపి పార్టీ చెబుతున్న తరుణంలో.. ఈ అంశం ఇటు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ సతీమణి సల్మా అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు తలాక్‌ అని చెప్పినంత మాత్రానా అది విడాకులుగా భావించరాదని చెప్పారు.

పెళ్లి చేయడం అన్నది భారత దేశంలోని పేద కుటుంబాలకు ఎంతో భారమని, అయినా వారి తాహత్తుకు తగ్గట్లుగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డ నూరేళ్లు చల్లగా జీవిస్తుందన్న అశతో అప్పులు చేసి మరీ వివాహాలు చేస్తున్నారని అన్నారు. భర్తో, భార్యో మూడు సార్లు తలాక్‌ అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదని తేల్చిచెప్పారు. ముస్లిం మహిళలకు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పారమె. ముస్లిం మహిళలు ఖురాన్‌ చదవాలని అన్నారు. మత పెద్దలు చెప్పేవాటినే గుడ్డిగా పాటించడం కాకుండా ఖురాన్‌ చదివితే అందులో అసలు ఏముందనేది తెలుస్తోందన్నారు.

మౌలానాలు ఏం చెప్పితే అది నిజమని నమ్మకూడదని, అనేక మంది మౌలనాలు, మత పెద్దలు వారి భావాలనే వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను చదవితే.. అందులో ఏముందో తెలుస్తుందని, అనువాద ఖురాన్ ను కూడా ఇష్టానుసారంగా మారుస్తున్నారని అమె అభిప్రాయపడ్డారు. విడాకుల విషయంలో షారియత్‌ ఏం చెబుతోందో అప్పుడే స్పష్టంగా తెలుసుకోవచ్చునన్నారు. అలీఘడ్‌లోని అల్‌ నూర్‌ చారిటబుల్‌ సొసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hamid Ansari  Salma Ansari  Quran  Divorce  Muslim women  Vice-president  

Other Articles