హ..హ..హా... వాట్ ఈజ్ దిస్ పురంధేశ్వరి? | Purandeswari terms Naidu's Cabinet unethical not correct.

Buddha venkanna fire on daggubati purandeswari

Buddha Venkanna Daggubati Purandeswari, Daggubati Purandeswari Letter, BJP Daggubati Purandeswari, Daggubati Purandeswari, Purandeswari Defection, Congress to BJP to YSRCP, Daggubati Purandeswari YDRCP, Daggubati Purandeswari 2019 Elections, Purandeswari Modi Amith Shah

TDP MLC Buddha Venkanna slams BJP Leader Daggubati Purandeswari. Over writes a letter to Amit Shah, Modi. Inducting defectors into Andhra cabinet undemocratic'. She describes Chandrababu cabinet act unethical.

పురంధేశ్వరి లాజిక్ మిస్సయ్యిందా?

Posted: 04/05/2017 04:06 PM IST
Buddha venkanna fire on daggubati purandeswari

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై తీవ్ర మనస్థాపానికి గురైన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి తన పార్టీ అధిష్టానానికి లేఖ రాయటం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో అధికార పక్షం పార్టీ వీటిని బాగా ప్రోత్సహిస్తుందని, ప్రతిపక్షం నుంచి చేరిన వారికి మంత్రి పదవులు అంటగట్టడం ఏంటని, మిత్రపక్షం అయినందున తద్వారా ఆ అపకీర్తి తమకు అంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే వాటిని నిలువరించాలని చెబుతూ అందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఏకంగా మోదీ, అమిత్ షాలకే సూచనలు కూడా చేసింది.

ఇది సహజంగానే తమ్ముళ్లకు మంట పుట్టించింది. తమ పార్టీని, స్పెషల్ గా అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాసిన లేఖకు కౌంటర్ ఇవ్వటం ప్రారంభించారు. ఈ లిస్ట్ లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముందు గళం అందుకున్నాడు. అసలు బీజేపీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటూనే పంచ్ లు పేల్చాడు . కాంగ్రెస్ పార్టీలో ఉండగా పదవులు అనుభవించిన మీరు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరడం పార్టీ ఫిరాయింపు కిందికి రాదా? అంటూ ప్రశ్నించాడు.

లేఖ రాయటం, పైగా అందులో పార్టీ ఫిరాయింపులపై పురంధేశ్వరి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉందని తెలిపాడు. జగన్ అవినీతి, జగన్ సూట్ కేసు కంపెనీలపై ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మీరు వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ అయిన వైఎస్సార్సీపీలో చేరుతారని ప్రజలు అనుకుంటున్నారని, ముందు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందంటూ లేఖలోనే మండిపడ్డాడు. ఏదైనా పదవిలో లేదు కానీ, ఉండి ఉంటే ఆమె చేసింది కూడా అలాంటిదేనన్న విషయం ఆమెకు గుర్తొచ్చి ఉండేదేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Purandeswari  AP Defections  Letter to Modi  

Other Articles