దుబాయ్ లో ఇండియన్ డాక్టర్ తలుపుతట్టిన లక్ష్మీదేవి.. Indian expat wins Dh10 million in raffle draw

Indian expat wins dh10 million in raffle draw

UAE, Nishita Radhakrishna Pillai, Indian doctor, Big Ticket, Abu Dhabi, Dh10 million, medical practitioner, raffle bonanza, Houston, Texas, 50 numerous attempts

Nishita Radhakrishna Pillai, a mother of two from India finally joined the ranks of high-net-worth individuals, as she won Dh10 million at the Big Ticket in Abu Dhabi.

అదష్టమంటే ఇదేరా.. డాక్టర్ తలుపుతట్టిన లక్ష్మీదేవి.. కోట్ల లాటరీ..

Posted: 04/05/2017 04:30 PM IST
Indian expat wins dh10 million in raffle draw

అదృష్టమంటే ఇదేరా అనిపించేలా అబుదాబిలో ఓ భారతీయ వైద్యురాలి పంటపండింది. అంతేగా మరి అదృష్టముంటే బండరాళ్లున్నా వాటిని జరుపుకుని వచ్చి తగులుతుందని పెద్దలంటారు. అబుదాబీలో జరిగిన ఈ సంఘటన చూస్తే అది నిజమని చెప్పక తప్పదు. టిక్కెట్లు కొన్నవారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న 10 మిలియన్ ధిరమ్ ల బంపర్‌ లాటరీలో తొలి ప్రైజ్ వరించింది. దీంతో అమె కూడా ఏకంగా సంపన్నుల జాబితాలో చేరిపోయారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన రాఫెల్‌ బోనాంజా లాటరీలో ఏకంగా రూ.17,69,03,813.39 ఆమెను వరించింది. అంతకుమునుపు దాదాపు 50 ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఆ తర్వాత ఈ అదృష్టం అమెకు కలిసొచ్చింది. అయితే టిక్కెట్ కొనుగోలు చేసిన తరువాత అమె అక్కడి నుంచి ఏకంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ పట్టనానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అమె తన ఉన్నత విద్య జెనిటిక్స్ ను పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో లాటరీ యాజమాన్యం అమె టికెట్ లో పోందుపర్చిన ఫోన్ నెంబరుకు ఫోన్ చేశారు. ఇంతకీ అమె పేరు ఏంటంటారా..? నిషితా రాధాకృష్ణ పిళ్లై.

అయితే నిషితా అమెరికాలోని టెక్సాస్ లో వుంటుందని.. లాటరీ టిక్కెట్ విషయం తెలియని అమె తండ్రి చెప్పారు. వారు విషయం చెప్పడంతో ఆయన ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే అంతకు ముందు అబుదాబిలో చిన్నపిల్లల వైద్యురాలిగా రెండేళ్లపాటు ఆమె భర్తతో కలిసి మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసింది. ఆమె భర్త ఇప్పటికే 50సార్లు రాఫెల్‌ బొనాంజా బిగ్‌ లక్కీ మిలియనీర్‌ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే ప్రతిసారి వారికి నిరాశే ఎదురైంది. దీంతో ఈ సారి టిక్కెట్ కొన్నా.. తమకు వస్తుందన్న నమ్మకం లేక వారు తమ పనులలో నిమగ్నం కాగా, అదృష్టం వారి తలుపుతట్టింది.

రాధాకృష్ణ టికెట్ కొన్న ప్రతీసారి తన భార్య నిషితా పేరునే కొన్నారు. ఈ సారి కూడా 058390 నెంబరు గల లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో ఈ నెంబర్‌కే ఆ లాటరీ తగిలింది. దీంతో నిషితా, ఆమె భర్త సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన నిషితకు తన తండ్రి ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు. అయితే అక్కడికి వెళ్లినా.. తమ లాటరీ ప్రయత్నాలను మాత్రం మానుకోకుండా అన్ లైన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఎట్టకేలకు వారికి అదృష్టం వరించింది. దీంతో భగవంతుడి సొంత రాష్ట్రంగా పేరొందిన కేరళకు చెందిన నిషితాకు ముందు మరో కేరళావాసిని కూడా అదృష్టం వరించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nishita Radhakrishna Pillai  Indian doctor  Big Ticket  Abu Dhabi  Dh10 million  

Other Articles