ఓలా క్యాబ్ బంఫరాఫర్: 300 మీటర్లు.. రూ.149 కోట్ల ఛార్జీ.. బిల్లు చూసి వణికిపోయాడు | 300 meters 149 Crore bill for Ola Drive.

Ola charged bomb bill to mumbai resident

Sushil Narsian, Ola Cab, Ola Ride, Ola Prank, 300 Meters 149 Crores Bill, Ola Cab Charge, Ola Cab Mumbai Resident, Ola Cab Planets, Ola Technical Glitch

Ola Cab Charged Mumbai resident Sushil Narsian Rs. 149 Crore for 300 meters drive. First he thinked that It Was A Prank, later the company informed him that it was a technical glitch. They refunded his money and fixed the 149-crore-anomaly within two hours.

ఫన్నీ: గ్రహాల మీదకు ఓలా క్యాబ్ లు??

Posted: 04/05/2017 09:41 AM IST
Ola charged bomb bill to mumbai resident

ఏప్రిల్ 1, 2017 కి ముంబై వాసి సుశీల్ నర్సియన్ జీవితంలో మరిచిపోలేడు. ఎందుకంటే క్యాబ్ సంస్థ ఓలా అంతలా షాక్ ఇచ్చింది కాబట్టి. 300 మీటర్ల ప్రయాణానికి ఏకంగా రూ. 149 కోట్ల బిల్లు వేసి అతనికి హర్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేసింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చదవండి.

సుశీల్ తాను నివాసం ఉంటున్న పశ్చిమ ములుంద్ వకోలా మార్కెట్ కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. అతన్ని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ అడ్రస్ కనుక్కోలేకపోయాడు. నర్సియాన్ స్వయంగా క్యాబ్ వద్దకు వెళ్లి ఎక్కగా, ఓ 300 మీటర్లు వెళ్లిన తరువాత, కారుకు సమస్య వచ్చి ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో మరో క్యాబ్ ను బుక్ చేసుకునేందుకు నర్సియాన్ ట్రై చేశాడు.

అయితే ఇంతలో మీ ఓలా యాప్ వ్యాలెట్ లో ఉన్న రూ. 127ను కట్ చేసుకున్నామని, మిగతా రూ. 1,49,10,51,648 మీరు బిల్లును చెల్లించాలని ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అవాక్కైన నర్సియాన్, కాల్ సెంటర్ కు ఫోన్ చేయగా, అది సాంకేతిక సమస్య కావచ్చని, సరి చేస్తామని చెప్పారు.

తొలుత తాను అది ఏప్రిల్ పూల్ ఫ్రాంక్ అని భావించానని సుశీల్ మీడియాకు తెలిపాడు. రెండు గంటల్లో సమస్య మనీని రిఫండ్ చేయటమే కాదు, జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతూ మరో సందేశం పంపించారని వివరించాడు. ఇక ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఉంచగా, నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఓలా టాక్సీలో తీసుకువెళ్లింది కొంపదీసి శని గ్రహానికా? అంటూ జోకులు పేలుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Resident  Ola Cab Drive  

Other Articles