చిన్నమ్మ ఔదార్యం.. భర్తను చేరుకునేందుక యువతికి సాయం.. 'Aap suicide mat kijiye', Sushma Swaraj tells distraught citizen

Woman gets sushma swaraj s attention on twitter by asking if she should commit suicide to get noticed

Sushma Swaraj Helps Suicidal Woman,Sushma Swaraj Helps Wife Reunite With Husband,New Zealand Sushma Swaraj Visa,External Affairs Minister Sushma Swaraj

External Affairs Minister Sushma Swaraj helped a woman living away from her husband, assured help to get her a visa to New Zealand and proved why she should be called Sushma 'super' Swaraj.

చిన్నమ్మ ఔదార్యం.. భర్త దరిచేరేందుకు భార్యకు సాయం..

Posted: 03/31/2017 03:46 PM IST
Woman gets sushma swaraj s attention on twitter by asking if she should commit suicide to get noticed

తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాను చిన్నమ్మనని ప్రకటించుకున్న కేంద్రమంత్రి దేశవిదేశాలలో వున్న భారతీయులందరికీ పెద్దమ్మగా మారారు. అమె మరెవరో కాదు భాతర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. తన పరిధిలోకి వచ్చిన తన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై క్షుణ్ణంగా దృష్టి సారించి.. వాటిని పరిష్కరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తారామె. ఈ క్రమంలో ఒకరు ఒకరు ఇలా యావత్ భారతీయుల మన్నన్నలను అందుకున్న ఏకైక కేంద్రమంతి అమె.

నిజానికి అమ్మ అనగానే తన సంతానానికి వచ్చిన సమస్యను తీర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అలానే చిన్నమ్మలో కూడా అమ్మ వున్నట్లు భారతీయుల నుంచి ఉత్పన్నమైన సమస్యను అమె తన సమస్యలుగా మలుచుకుని వాటిని పరిష్కరిస్తారు. ఈ విషయంలో అమె చోరవతో ఎంతో మంది సఖసంతోషాలతో వున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజగా ఓ భారతీయ యువతి అమ్మతో సాయం లేచేయాలని కోరగా అమె మరోమారు తన ఔదర్యాన్ని, సహృదయాన్ని చాటుకున్నారు.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన యువతి.. తనకు సాయం చేయకపోతే.. అత్మహత్యే శరణ్యమని చెప్పింది. ఈ మేరకు యువతి సుష్మస్వరాజ్ కు ట్విట్టర్ అనుసంధానంగా మెసేజ్ పెట్టారు. తన భర్త న్యూజిలాండ్ లో ఉన్నాడని, అతన్ని కలుసుకునేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటే, మూడు సార్లు రిజెక్ట్ అయిందని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని జ్యోతి ఎస్ పాండే అనే యువతి ట్వీట్ పై సుష్మ స్పందించారు. ఆత్మహత్య సమస్యలు పరిష్కారం లభించదని, సమస్యేంటో వివరంగా చెప్పాండని సుష్మ రీట్విట్ పెట్టారు. వీసా దరఖాస్తు కాపీని తన కార్యాలయానికి పంపాలని చెబుతూ, తన ఈమెయిల్ అడ్రస్ ను కూడా ఇచ్చారు.

అంతే అప్పటి వరకు తాను భర్తకు దూరంగానే వుండాలా..? అంటూ అందోళనకు గురైన జ్యోతిలో సుష్మ రీట్విట్ తో వెయ్యేనుగుల బలం వచ్చిచేరింది. తనలో కొత్త అశలు చిగురించాయి. వెనువెంటనే కించిత్ అలస్యం కూడా చేయకుండా అమె సుష్మ కార్యాలయానికి పంపిన జ్యోతి ఇక తనకు త్వరలోనే వీసా వస్తుందని అశిస్తున్నారు. సుష్మస్వరాజ్ ను అందరు కొనియాడుతుంటే.. తనకు తెలియలేదని, అయితే అమె స్పందించిన తీరు అమోఘమని అభినందించారు. తన గోడు విన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని ఆశీర్వదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Jaipur woman  rajasthan women  Suicidal Woman  New Zealand  Visa  

Other Articles