నారా లోకేష్ ప్రమాణస్వీకరాం.. సెటైర్ల వెల్లువ.. Tongues wag as Nara Lokesh falters during oath-taking

Tongues wag as nara lokesh falters during oath taking

Nara Lokesh, Nara Lokesh news, pronounciation, Sraddasaktulu, Sarvabhoumadhikaram, NT Rama Rao, Balakrishna, jr. NTR, Chandra babu, south news

Nara Lokesh faltered a little during his swearing-in as an MLC, causing some tongues to wag regarding his competence in his mother tongue.

ITEMVIDEOS: కామెడీ షోను తలపించిన చిన్నబాబు ప్రమాణస్వీకారం..

Posted: 03/31/2017 04:33 PM IST
Tongues wag as nara lokesh falters during oath taking

తెలుగుదేశం పార్టీ నేతలు.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీయార్ కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ పార్టీలో కీలక పదవులను అలంకరించనున్న నేతలు.. మాట మాట్లాడితే.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పేరు చెప్పకుండా పూటగడపని పరిస్థితి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీయార్ జయంతి, వర్థంతి రోజులతో పాటు పార్టీ వ్వవస్థాపక దినోత్సవాల సమయాల్లో.. మహానాడు సమావేశాల్లో ఆయన పేరును తప్పకుండా గుర్తుకు తెస్తుంటారు. ఇక ఐదేళ్లకు ఓ పర్యాయం వచ్చే ఎన్నికల సమయంలో మాత్రం ఎన్టీరామారావు పేరును ఊదరగొడతారు.

ఇక నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు నాయుడైతే తాను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా వున్నానాని, ప్రతిపక్షంలో పదేళ్లు వున్నానని, ప్రస్తుతం మూడేళ్లుగా నవ్యాంధ్ర కు తాను ముఖ్యమంత్రిగా వున్నానని కూడా పదే పదే గుర్తు చేస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సమావేశాలలోనూ ఆయన ఈ విషయాలను గుర్తుచేయడం.. కారణాలు ఏమో తెలియాదు కానీ.. దీనిపై సెటైర్లు మాత్రం చాలనే వినిపిస్తుంటారు. ఎన్టీ రామారావును మర్చిపోయిన టీడీపీ నేతలు.. ఆయనను కూడా ఎక్కడ మర్చిపోతుంటారోననే చంద్రబాబు ఇలా అంటుంటారని సెటర్లు విపబడుతున్నాయి.

ఇక టీడీపీ నాయకులు ఎన్టీయార్ గురించి ఎంతో చెబుతారు కానీ ఆయన మార్గాలను అచరించరని మరికోందరు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా టీడీపీ అగ్రనేతలు చెబుతున్న మాటల్లో వున్నంత నిజాయితీ చేతల్లో వుండివుంటే స్వర్గీయ ఎన్టీయార్ కు ఎప్పుడో భారత రత్న అవార్డు దక్కేదన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి. అగ్రనేతలు బడాయిలు కోటలు దాటు.. కానీ ఎన్టీయార్ భారత రత్న అంశంలో మాత్రం చేతలు గడప దాటవని విమర్శించే వారి సంఖ్య లేకపోలేదు.

ఈ విషయాన్ని పక్కనబెడితే.. అన్నగారు.. ఆంధ్రుల అరాధ్యుడైయ్యేందుకు ముఖ్యకారణం.. ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు, వాటిలో దాదాపు ఐదు నిమిషాల నిడివిలో వున్న డైలాగులను కూడా ఎక్కడ పోల్లుపోకుండా.. స్పష్టమైన ఉచ్చరణతో పలుకుతుంటారు. ఆయన అదరాల కదిలిక నుంచి వచ్చే వేడి వాయువు కూడా స్పష్టమైన ఉచ్చరణతోనే బయటకు వస్తుందంటే అతిశయోక్తి కాదేమో.

అలాంటి అన్నాగారి వారసులమని చెప్పుకునే చిన్నబాబు నారా లోకేష్.. ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారన్ని చేసిన విధంబెట్టిదననిన.. అంటూ వీడియోలో అనేకం సోషల్ మీడయాలో చక్కర్లు కోడుతున్నాయి. అన్నగారి వారసులమని చెప్పుకునే నేతలకు రాజకీయంగా అంత ఫాలోయింగ్ లేకపోయినా పర్వాలేదు కానీ,. కనీసం ఆన్నగారిలా స్పష్టమైన ఉచ్చరణ లేకపోయినా పర్వాలేదు కానీ.. పదాలను పలికేందుకే నానా తంటాలు పడుతుంటే.. ఎట్టా..? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికోందరైతై తెలుగుకు తెగులు పట్టిస్తున్న వీళ్లా మన తెలుగుదేశపు నేతలంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles