ఏటీఎంలు ఎండిపోతున్నాయ్.. ఎక్కడ చూసినా నో క్యాష్.. దీనికి కారణం అదే | Bank ATMs go dry in Telugu States.

Atms go into cashless mode again hyderabad

Hyderabad Bank ATMs, ATM Cashless, ATM Out of Order, 2017 Financial Year, ATM and Banks No Cash, ATMs Run Dry, No Cash ATM, ATM Que Hyderabad

ATMs run dry in Hyderabad before financial year ending.

నో క్యాష్.. అవుటాఫ్ సర్వీస్

Posted: 03/28/2017 09:09 AM IST
Atms go into cashless mode again hyderabad

ఊరట ఇచ్చినట్లే ఇచ్చి నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా భాగ్యనగరంలోని దాదాపు 90 శాతం ఏటీఎంలలో నగదు నిండుకుంది. ఎక్కడ చూసినా ‘నో క్యాష్’, ‘అవుటాఫ్ సర్వీస్’ బోర్డులు కనిపిస్తుండడంతో జనాలు బిక్కమొహం వేస్తున్నారు. డబ్బుల కోసం హోం బ్రాంచ్‌లకు పరుగులు పెడుతున్నారు. ఆర్బీఐ నుంచి సరిపడా డబ్బులు బ్యాంకులకు చేరకపోవడమే ప్రస్తుత కష్టాలకు కారణమని తెలుస్తోంది.

నగదు రావడం తగ్గిపోవడంతో ఏటీఎంలలో నగదు నింపడం కష్టంగా మారిందని ఏజెన్సీలు చెబుతున్నాయి. నగరంలో మొత్తం అన్ని బ్యాంకుల ఏటీఎంలు కలిపి 4,520 ఉండగా, వీటిలో 15 శాతం బంద్ అయ్యాయి. వచ్చే వాటిలో కూడా కేవలం రెండు వేల నోట్లే వస్తుండటంతో మరోసారి అప్రకటిత చిల్లర కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేటు బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు.

క్యాష్‌లెస్ విధానంలో భాగంగానే బ్యాంకులు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు బ్యాంక్ అసోసియేషన్ నాయకులు అంటున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడాన్ని నిలిపివేసిందని వారు చెబుతున్నారు. అందుకే చిన్న నోట్ల జారీ విషయంలో అలసత్వంతోపాటు కొత్త నోట్లకు ఆర్థిక శాఖ సిద్ధంగా లేదని చెబుతోందని వారంటున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1 తర్వాత ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించేందుకు సిద్ధం అవుతుండగా, తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఖాతాదారులు కూడా రెడీ అయిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  No Cash  ATM and Banks  

Other Articles