జయ చాలా అందగత్తె.. క్రష్ ఉండేది... ఆ టైంలో చెప్పలేకపోయా... | Markandey Katju's romantic Facebook post.

Markendey katju crush on jayalalithaa

Markandey Katju, Markandey Katju Facebook, Markandey Katju Jayalalithaa, Markandey Katju Crush, Markandey Katju TamilNadu, Markandey Katju AIADMK, Markandey Katju Fire, Markandey Katju Controversy Post, Markandey Katju Amma, Markandey Katju Jayalalithaa Crush, Former Supreme Court judge Markandey Katju, Markandey Katju Young Age, Markandey Katju Love, Former Justice Markandey Katju

Markandey Katju's Facebook post remembering the former TN CM goes viral. This Former Supreme Court judge says When he was young, he had a crush on Jayalalithaa.

జయలలితపై మనసు పడ్డాను, కానీ...

Posted: 03/28/2017 08:28 AM IST
Markendey katju crush on jayalalithaa

ఆయన నోటికి వివాదాలు కొత్త కాదు. ఎంతొస్తే అంత మాట అనేస్తాడు. విమర్శలు వెల్లువెత్తినా చాలా చాలా తేలికగా తీసేసుకుంటాడు. ఆ నెక్స్ట్ అంతే కంటే దారుణమైన వ్యాఖ్యలే చేస్తాడు. ఇది మార్కండేయ కట్జూ అనే ఓ పెద్దాయన వ్యవహారశైలి. సుప్రీం కోర్టు మాజీ అయిన ఈయనగారు కత్రినా కైఫ్ నుంచి ధర్మేంద్ర వరకు ఎవరినీ వదలడు. ఆడ మగ తేడా లేకుండా అందరి మీద ముద్దులతో ప్రేమను కురిపించటం కట్జూ స్పెషాలిటీ. అలాంటిది దివంగత జయలలిత గురించి మరోసారి అదోరకం కామెంట్లు చేసేశాడు.

తాను కుర్రాడిగా ఉన్నప్పుడు జయలలిత అంటే క్రష్ ఉండేదని చెబుతున్నాడు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీనేజ్ లో ఉన్నప్పుడు జయలలిత అంటే పడి చచ్చేవాడిని, ఆమె ఎంతో అందంగా ఉండేదని భావించే వాడిని అంటూ అందులో తెలిపాడు. 1948 ఫిబ్రవరి నెలలో జయలలిత జన్మించగా, 1946 సెప్టెంబర్ నెలలో తాను జన్మించానని పేర్కొన్నాడు. చెన్నైలోని రాజ్ భవన్ లో 2004 నవంబర్ లో మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మొట్టమొదటి సారిగా మాజీ సీఎం జయలలితను కలిశానని గుర్తు చేసుకున్నాడు.

అయితే, అప్పటికీ ఆమె చాలా అందంగా ఉన్నారని, ఆమె గురించి తన కుర్ర వయసులో ఉన్న భావాలను ప్రస్తావించలేదని, అది సరైన సమయం కాదని అందులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ తోపాటు జయలలిత నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘యార్ నీ?’లోని రొమాంటిక్ పాటను కూడా ఆయన పోస్ట్ చేశాడు. అంతేకాదు షేర్, షేర్నీ అంటూ జయతో ఉన్న ఓ ఫోటోను పెట్టి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. గతేడాది ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆమెను తానెంతో ఇష్టపడ్డానని, ఆమె త్వరగా కొలుకోవాలంటూ ట్వీట్లు చేసి విమర్శలు రావటంతో కాస్త వెనక్కి తగ్గాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former Justice Markandey Katju  Jayalalithaa  Crush Post  

Other Articles

Today on Telugu Wishesh