కాఫీ డే ఫ్రిడ్జ్ లో బొద్దింకలు.. వీడియో తీస్తుంటే ఆమె ఏం చేసిందో చూస్కోండి | CCD employee slaps customer for finding cockroaches.

A cafe coffee day employee slapped a customer

CCD Staff Beat, Cockroaches Fridge, CCD Employee Slap, Coffee Day Attack Video, CCD Employee Video, Cafe Coffee Day Video

A Customer Was Slapped By CCD Staff In Jaipur For Finding Cockroaches In Their Fridge.

ITEMVIDEOS: కాఫీ డేలో వీడియో తీస్తుంటే చెంప పగిలింది

Posted: 03/28/2017 08:00 AM IST
A cafe coffee day employee slapped a customer

సాధారణంగా మనం నిత్యం వెళ్లే హోటళ్లుగానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్ లుగానీ ఎంత శుచి శుభ్రంగా ఉంటాయో చాలా మందికి తెలీదు. పై పై హంగులు, ఆర్భాటాలు చూసి వెళ్లటమే తప్ప లోన లొటరాం అన్నది ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన లాంటివి తెలిశాకే అర్థమౌతుంది. ఇక్కడో లా విద్యార్థికి తాను వెళ్లిన కాఫీ షాప్ ఎంత చెండాలంగా ఉందో చెప్పే యత్నం అక్కడి సిబ్బందికి చేశాడు. అంతే పిచ్చి తన్నులు తిన్నాడు. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్ లో కాఫీ తాగేందుకు నిఖిల్‌ ఆనంద్‌ సింగ్‌, అర్పణ్‌ వర్మ అనే లా విద్యార్థులు కేఫ్ కాఫీ డేకు వెళ్లారు. ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ ను చూశాడు నిఖిల్. అంతే అక్కడ బొద్దింకల గుంపును చూసి విస్తుపోయి దానిని వీడియో తీయటం ఆరంభించాడు. ఇంతలో అక్కడే ఉన్న ఓ మహిళా సిబ్బంది నిఖిల్ ను గమనించింది. వెంటనే కోపంతో అతని మీదకు దూసుకొచ్చింది.

 

అతని చెంపపై ఫటా ఫటా లాగి కొట్టింది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. తనను వీడియో తీసినందుకే అతన్ని కొట్టానని ఆమె చెప్పటం కొసమెరుపు. దీంతో బాధితులు దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన హోటల్ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. పరిశుభ్రతను కోరుకునే వారు ఖరీదైన హోటళ్లకు వెళ్లితే ఇదిగో ఇలాంటి సీన్లే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cafe Coffee Day  Cockroaches Fridge  Attack Video  

Other Articles