చెత్త రోడ్లు, డ్రైవర్ నిర్లక్ష్యం... పాతిక ప్రాణాలు పోయాయి | Road Accidents in North India kills 25 people.

25 people killed in 2 road accidents in india

Road Accidents India, Jabalpur Road Accident, Imphal Bus Accident, Manipur and Madhya Pradesh Accidents, North India Road Accidents, Bus Fall in Stream, Truck Accident

22 people killed in 2 different road accidents in Manipur and Madhya Pradesh.In Imphal 10 killed as bus falls into stream.15 killed as mini truck falls into ditch in Jabalpur. Driver fatigue, negligence, and poor road quality and vehicle maintenance are often the causes of such accidents in India.

మణిపూర్, మధ్యప్రదేశ్ లో ఘోరం

Posted: 03/27/2017 03:33 PM IST
25 people killed in 2 road accidents in india

ఉత్తర భారత దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 25 మందిని బలి తీసుకుంది. సోమవారం ఉదయం ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ లో ఓ బస్సు లోయలో పడిపోగా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక మధ్యప్రదేశ్ లో జరిగిన ఘో రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు.

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని నీచీ అనే గ్రామంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, మ‌రో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలను తీసుకెళ్తున్న మినీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని అక్క‌డి పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో స‌ద‌రు ట్రక్కు డ్రైవర్‌ బయటకు దూకేసి అక్కడి నుంచి పారిపోయాడ‌ని తెలిపారు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న స‌హాయ‌క బృందాలు అక్క‌డ‌కు చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాయి. ఈ ఘ‌ట‌న‌పై కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక మణిపూర్ లోని సేనాపతి జిల్లాలో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు పది మంది చనిపోయారు. అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొట్టి మరీ లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితి బాగోలేకపోవటం మూలంగానే ఈ మధ్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందని రవాణా శాఖ  ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Manipur  Road Accidents  

Other Articles