విమానంలోకి లెగ్గింగ్స్ వేసుకొచ్చారని.. ఏం చేశారో చూడండి | United Airlines bars teenage girls in leggings from flight.

United airlines bar teens in leggings from flight

United Airlines, United Airlines Ban, Leggings Ban, Leggings Ban Flight, Teenage Girls in Leggings, Twitter United Airlines, Indian Girls in Leggings, Leggings Controversy

United Airlines defends banning two girls from wearing leggings on flight, as Twitter spat erupts including celebrities.

లెగ్గింగ్స్ వేసుకుంటే అలానే చేస్తాం

Posted: 03/27/2017 09:37 AM IST
United airlines bar teens in leggings from flight

యునైటెడ్ ఎయిర్ లైన్స్ చేసిన పనికి ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సెలబ్రిటీలతో సహా పలువురు వారు చేసిన నిర్వాకానికి మండిపడుతున్నారు. కేవలం లెగ్గింగ్స్ వేసుకుని వచ్చారన్న కారణంతో ఇద్దరు అమ్మాయిలను విమానం ఎక్కనివ్వలేదు సదరు సంస్థ. డెన్వర్ నుంచి మిన్నీపొలిస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరుగగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్ వైఖరిపై సోషల్ మీడియాలో నెటిజిన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ముందుగా లెగ్గింన్స్ వేసుకున్నారని అమ్మాయిలను విమానం ఎక్కనివ్వని అధికారులు, విమానంలో వెళ్లాలంటే, దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారని షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తమ చర్యను ఆ విమానయాన సంస్థ మాత్రం సమర్ధించుకుంది. దుస్తులు సరిగ్గా లేకుంటే, వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని చెప్పింది. సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని చెబుతూ, పాస్ మీద ప్రయాణించేవాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది.

ఆ ఇద్దరూ సంస్థ ఉద్యోగుల పాస్ లతో ప్రయాణిస్తున్నందునే డ్రస్ కోడ్ పాటించాల్సిందిగా సూచించామని ప్రకటించింది. అయితే లెగ్గింగ్స్ సరైన దుస్తులు కావని ఎలా చెబుతారని పలువురు సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణం వేళ సుఖంగా ఉండేందుకు చాలామంది మహిళలు లెగ్గింగ్స్, యోగా దుస్తులు, అథ్లెటిక్ దుస్తులు ధరిస్తారని, ఇది కొత్తేమీ కాదని చెబుతు ఎయిర్ లైన్స్ పై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United Airlines  Girls Legging  Ban  

Other Articles