ట్రంప్ ఎంత మొండి మనిషో మళ్లీ రుజువయ్యింది. | Trump's Divisive New Travel Ban.

President trump s new travel ban is much narrower

Travel Ban Order, Trump Sign, Donald Trump, America Travel ban, Travel Ban Muslim Countries, Islam Countries Ban, Travel Ban Countries, Trump Sign Travel Ban Executive Order, Muslim Ban, Iraq Travel Ban, Travel Ban Executive Order, New Travel Ban Order

America President Trump signs revised travel ban order, leaves out Iraq from list.

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ మరో ట్విస్ట్

Posted: 03/07/2017 07:22 AM IST
President trump s new travel ban is much narrower

ప్రపంచదేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నా, న్యాయస్థానాలు అడ్డుకుంటున్నా... ట్రావెల్ బ్యాన్ విషయంలో మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మొండిగానే ముందుకు పోతున్నాడు. ఉగ్రవాదానికి మూలకారణం అంటూ ఏడు ఇస్లాం దేశాలపై నిషేధం విధిస్తూ పెద్ద రచ్చే లేపాడు ఆయన. అయితే కోర్టులు తాత్కాలికంగా వాటిని నిలుపుదల చేయాలని భావించినప్పటికీ వెనక్కి తగ్గటం లేదు . ఇరాన్‌, సిరియా, లిబియా, యెమెన్‌, సూడాన్‌, సొమాలియా ముస్లిం దేశాలపై ఈసారి పకడ్బందీ నిషేధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదిపాడు.

న్యాయ ప్రతిబంధకాలు లేకుండా కొత్త ఉత్తర్వును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులపై సోమవారం ట్రంప్ సంతకం కూడా చేశాడు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆరు ముస్లిం ఆధిక్య దేశాల పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి అనుమతించరు. కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉంటే వారికి అమెరికాలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

సవరించిన ఉత్తర్వుల్లో ఇరాక్‌ పేరును తొలగించడం గమనార్హం. అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఇరాక్‌ అంగీకరించడంతో ఆ దేశం పేరును జాబితా నుంచి తొలగించారు. తొలుత ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వలసదారులను అక్రమ ప్రవేశం పేరిట ఎయిర్‌ పోర్టుల వద్దే అడ్డుకోవడం, వారిని స్వదేశాలకు పంపేయడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫెడరల్ న్యాయస్థానం కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి నిషేధపు ఉత్తర్వులు చాలా పక్కాగా రూపొందించారని వైట్‌హౌస్‌ అధికారులు చెబుతున్నారు.

గతంలో వలే అమెరికా విమానాశ్రయాల్లో ఎలాంటి గందరోగళం ఉండదని, చెల్లుబాటయ్యే వీసాలతో ప్రయాణిస్తూ అమెరికా ఎయిర్‌పోర్టులకు చేరుకున్నవారిని కూడా దేశంలోని అనుమతిస్తారని వారు చెప్పారు. నిషేధం విధించిన దేశాల్లో మూడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా... మరో మూడు దేశాలు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్నాయని అమెరికా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్ వివరించాడు. మార్చి 16 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. అంతేకాకుండా గతంలోలా అమెరికా వీసా ఉన్నవారెవరినీ అడ్డుకోరని, సిరియా శరణార్థులపై వివక్ష ఉండదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Americam President  Donald Trump Sign  Travel Ban  Executive Order  

Other Articles