మాల్యా కన్నా ‘తెలంగాణ ఎల్లయ్య’ ఎంతో బెటర్.. ఇంతకీ ఏం చేశాడసలు? | Eliah better than Vijay Mallya.

Supreme court comments on vijay mallya

Telangana Vijay Mallya, Supreme Court Vijay Mallya, Vijay Mallya Saree Thief, Saree Thief Better than Vijay Mallya, Safe in UK, Vijay Mallya Absconding, Eliah Vijay Mallya, Supreme Court Sarees Theft Case, Eliah Saree Stealing Case, Telangana Police Supreme Court, 9000 Crores Vijay Mallya

Hearing the case of a man in Telangana who has been in jail for a year for allegedly stealing a grand total of five sarees, the Supreme Court had a question - what about the person who has defaulted on crores of rupees? The hint at Vijay Mallya, the liquor baron wanted in India on charges of fraud linked to unpaid loans, was not missed. Chief Justice of India Justice JS Khehar did not name Mr Mallya as he said, "A person who has taken away crores of rupees is enjoying life. But here a person who took five sarees is in jail." The Supreme Court was hearing a petition by the wife of Ch Eliah, arrested in Hyderabad over a year ago and in prison without trial.

మాల్యా కన్నా మన ఎల్లయ్య ఎంతో బెటర్

Posted: 03/07/2017 08:17 AM IST
Supreme court comments on vijay mallya

వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా విదేశాల్లో జాలీగా గడుపుతూ, మధ్య మధ్యలో మీడియాపై విరుచుకుపడుతున్న విజయ్ మాల్యా గురించి కేంద్ర ప్రభుత్వం సంగతి ఏమోగానీ, సుప్రీం కోర్టు మాత్ర స్పందించింది. అంతేకాదు ఓ కేసును అడ్డుపెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ కేసు ఎక్కడిదో కాదు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించింది కావటమే ఇక్కడ కొసమెరుపు.

ఎల్లయ్య అనే వ్యక్తి చీరల దొంగతనం కేసులో గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ట్రయల్ లేకుండానే అతగాడు ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్నాడు. కేవలం ఐదు చీరలు దొంగతనం చేసినందుకే తన భర్తను విచారణ కూడా లేకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అతని భార్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసు ధర్మాసనం ముందుకు రాగా న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ మాల్యాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఓ వ్యక్తి ఉన్నాడు. బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. పైగా అక్కడ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. కానీ, ఇక్కడో వ్యక్తి ఐదు చీరలు దొంగతనం చేశాడని బోనులో నిలబెట్టారు. ఇది ఎంత దారుణం’’ అంటూ పరోక్షంగా మాల్యా గురించి వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా ఎల్లయ్యను అరెస్ట్ చేశారని అతని తరపు న్యాయవాది వాదించగా, చీరల దొంగతనం గురించి షాపు యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము అదుపులోకి తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు బుధవారం మళ్లీ విచారణకు రానుంది.

61 ఏళ్ల మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కుప్పకూలిపోవటంతో 9,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టి యూకే పారిపోయిన(మాల్యా దృష్టిలో తలదాచుకోవటం) విషయం తెలిసిందే. ఈ మధ్యే తాను అక్కడ సురక్షితంగా ఉన్నానని చెప్పటమేకాదు, తనను భారత్ కు తీసుకెళ్లే హక్కు ఎవరికీ లేదంటూ కామెంట్ కూడా చేశాడు.

 

ఇవి కూడా చదవండి...

 

ఆర్థిక నేరం కాదు.. ఉత్త అమాయకుడేనంట!

ఆల్ ఈజ్ వెల్ అంటున్న మాల్యా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Vijay Mallya  Telangana Man  Saree Stealing Case  

Other Articles