రాహుల్ కొబ్బరికాయ జ్యూస్ జోక్ విన్నారా..? PM Modi mocks Rahul Gandhi's 'factory' ideas

Pm modi mocks rahul gandhi s factory ideas

Uttar Pradesh elections, UP polls, UP poll results, Narendra Modi, Rahul Gandhi, PM Modi, BJP, SP, SP-Congress alliance, Akhilesh Yadav, BSP, Mayawati, coconut comments, twitter trolling, rahul gandhi online jokes, rahul twitter

"Friends, I just want to crosscheck my gyan...what is there inside a coconut, is it water or juice?" Modi questioned people while addressing a rally in Maharajganj

రాహుల్ కొబ్బరికాయ జ్యూస్ జోక్ విన్నారా..?

Posted: 03/02/2017 10:29 AM IST
Pm modi mocks rahul gandhi s factory ideas

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా గత మూడు మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, మరోవైపు  అంతకు రెట్టింపుస్థాయిలో ఆయనపై అన్ లైన్ లో జోకులు పేలుతున్నాయి. అందుకు కారణం ఆయన ఎన్నికల ప్రసంగాల్లో చేస్తున్న వ్యాఖ్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి ఎప్పటికప్పుడు ఆయనపై జోకులను ప్రచారం చేస్తూ.. వాటిని ఎన్నికల ప్రచారంలో ఎండగడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రధాని మంత్రి నరేంద్రమోడీ కూడా రాహుల్ గాంధీపై వ్యంగోక్తులు విసురుతూ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఓ కాంగ్రెస్ నాయకుడికి కమేడియన్ గా ఆన్ లైన్ లో మంచి ఆదరణ వుందని, ఆయనపై ఎన్ని జోకులు అన్ లైన్ లో ప్రచారంలో వున్నాయోనని అన్నారు. రాహుల్ గాంధీ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని మోడీ అయనపై వ్యంగోక్తులు విసిరారు. ఇక తాజాగా రాహుల్ చేసిన కొబ్బరి జ్యూస్ వ్యాఖ్యలు కూడా ప్రధానికి మంచి అవకాశాన్ని ఇచ్చాయి. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసిన రాహుల్ వ్యాఖ్యలనే టార్గెట్ చేశారు ప్రధాని మోడీ.

ఇవాళ మహరాజ్ గంజ్ లో ప్రధాని ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. కోందరు కాంగ్రెస్ నేతలకి కొబ్బరి కాయల నుంచి జ్యూస్ వస్తుందని అంటున్నారు. ఈ విషయాన్ని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.. కొబ్బరి నుంచి జ్యూస్ వస్తుందా..? లేక నీరు వస్తుందా..? అంటూ చురకలంటించారు. వీరి నుంచి దేశాన్ని ఎవరు కాపాడతారు.. అయితే తాము చదువుకున్న వారం కాకపోవచ్చ.. లేదా అవతలి వారు అధిక జ్ఞానమున్న వారు కావచ్చు. అసులు ఇప్పటి వరకు ఎవరైనా కొబ్బరి కాయ జ్యూస్ అని విన్నారా.. అంటూ వ్యంగస్త్రాలు సంధించారు. ఇక దీనిపై అటు సోషల్ మీడియాలోనూ జోకులు పేలుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles