అగ్రరాజ్యంలో జాతి వివక్ష మరోసారి పడగ విప్పింది. ఈసారి మాత్రం ఓ తెలుగువాడి ప్రాణం తీసింది. బార్‌లో జరిగిన వాగ్యుద్ధంలో రెచ్చిపోయిన అమెరికన్ ఓ తెలుగు వ్యక్తిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కాన్సస్ రాష్ట్రంలోని ఓలెత్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్’లో తెలుగువారైన శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలతో ఆడమ్ ప్యూరిన్టన్ అనే వ్యక్తి ‘మీరు నాకంటే ఎందులో గొప్పో’ చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో తాగిన మత్తులో ఉన్న ప్యూరిన్టన్ ను బార్ సిబ్బంది బయటకు పంపించేశారు.
అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తుపాకితో తిరిగొచ్చిన ప్యూరిన్టన్ శ్రీనివాస్, అలోక్ లపై కాల్పులు జరిపాడు. కాల్పులకు ముందు ‘మా దేశం వదిలిపోండి.. టెర్రరిస్ట్’ అని అరిచాడని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక కాల్పులు జరుపుతున్న ప్యూరిన్టన్‌ను అడ్డుకునేందుకు ఇయాన్ గ్రిల్లోట్ అనే అమెరికన్ ప్రయత్నించడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. అతడి చేయి, భుజంలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ గార్మిన్ కంపెనీ ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ టీంలో పనిచేస్తున్నట్టు సమాచారం. కాల్పుల ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ బార్‌లో దాక్కునేందుకు ప్రయత్నించిన ప్యూరిన్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా దుండగుడి కాల్పులకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల 2005లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఏవియేషన్ ప్రోగ్రాంలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకున్న అలోక్ మాడసాని గార్మిన్ కంపెనీలో ఏవియేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మేజేజ్ మెంట్ దిగ్భ్రాంతి...
గార్మిన్ కంపెనీ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మైనార్డ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కంపెనీ తరుపున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగంలోలోని పనిచేస్తున్న శ్రీనివాస్ కూచిబొట్ల దురదృష్టవశాత్తు కన్నుమూశాడు. మరో సహచరుడు అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అలోక్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. శ్రీనివాస్ మృతిపట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారి కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. మేం వారికి అండగా ఉంటాం’ అని ఆ ప్రకటనతో తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more