నిర్మాతగా కాదు.. నువ్వే హీరోయిన్ అంటూ న్యూడ్ ఫోటోలు తీశాడంట! | Girl cheated by youth for movie chances.

Youth cheats girl with fake movie chances

Fake Director Arrest, Cheats Girl Movie Offer, Fake Movie Offers, Hyderabad Girl Cheated, Youth Arrest, Hyderabad Girl Fake Movie Offers, Hyderabad Girl Black Mail, Girl Black Mail Nude Photos, Director Cheats Artist, Movie Chances Cheat, Nude Photos Black Mail Arrest

Man cheats girl in name of fake movie chances in Hyderabad Boduppal Area.

న్యూడ్ ఫోటోలు.. ఫేక్ దర్శకుడి అరెస్ట్

Posted: 02/17/2017 11:14 AM IST
Youth cheats girl with fake movie chances

సినిమాల పేరుతో అవకాశాలు ఇస్తామని చెప్పటం, వాటి వంకతో యువతులను మోసం చేసే మృగాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. రీసెంట్ గా హైదరాబాదులో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తాను దర్శకుడిని అంటూ పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి యువతిని శారీరకంగా వాడుకోవటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే... బోడుప్పల్ ప్రాంతంలో నివసిస్తున్న సదరు యువతికి సినిమాల్లో ఆఫర్ల కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. ఈ క్రమంలో మధురానగర్‌ లో ఉండే కార్తికేయ తో ఫేస్ బుక్ లో పరిచయమైంది. అతగాడి ఫ్రోఫైల్ లో కూడా సినీ దర్శకుడు అని ఉండటంతో తన పని సులువుగా అవుతుందని ఆ అమ్మాయి భావించింది. చివరకు నిర్మాతగా మారి సినిమా తీస్తానంటూ అతనికి ఆఫర్ కూడా ఇచ్చింది.

అయితే ఎవరినో ఎందుకు హీరోయిన్ గా పెట్టడం ఎందుకు, నిన్నే హీరోయిన్ ను చేస్తానంటూ కార్తికేయ యువతిని నమ్మించాడు. స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తానన్న వంకతో ఆమెకు కొన్ని ఫోటోలు తీశాడు. నెమ్మదిగా లొంగదీసుకుని తన కోరిక తీర్చేసుకున్నాడు. ఆపై ఆ ఫోటోలు,వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో విసిగి వేసారిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి,అతనిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Movie Offers  Cheating  Arrest  

Other Articles