అన్నాడీఎంకే సీఎం పోరు వారం హైడ్రామా తర్వాత ఎట్టకేలకు ముగిసింది. చిన్నమ్మ జైలుకు వెళ్లినా సరే అనుచరుడిని ముఖ్యమంత్రిగా చేసి తన పంతం నెగ్గించుకుంది. దీంతో పన్నీర్ సెల్వం పరిస్థితి అయోమయంలో పడిపోయింది. బలనిరూపణకు 14 రోజుల గడువు ఇచ్చినప్పటికీ, ఈ గ్యాప్ లో సమీకరణాలు తారు మారు అయ్యే అవకాశం ఉండటంతో శనివారమే దానికి రెడీ అయిపోతున్నాడు కొత్త సీఎం పళనీస్వామి. ఇదిలా ఉండగానే మరోసారి అమ్మ సమాధి వద్ద హైడ్రామా నడిపిన ఓపీస్ ప్రభుత్వాన్ని కూల్చటమే తన లక్ష్యమంటూ ప్రకటించాడు కూడా. పన్నీర్ దారెటు?
మొత్తం 134 మంది ఎమ్మెల్యేలలో తనకే 124 మంది మద్ధతు ఉందని పళనీ ప్రకటించిన విషయం తెలిసిందే. సెల్వం బ్యాచ్ లో పది మంది ఉన్నప్పటికీ వారిని పార్టీ నుంచి తొలగించటంతో వారు తిరిగే వచ్చే అవకాశాలు లేవు. ఇక ఉన్న వారిని ఒక్క రోజు కాపాడుకుంటే చాలూ పళనీ నాలుగేళ్లపాటు ఏ అడ్డూ లేకుండా పాలన సాగించుకోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అదే సమయంలో కొత్త వారేవ్వరూ తమిళనాడును ఎంతో కాలం ఏలలేదన్న చరిత్ర కూడా ఉంది.
కీలకం కానుకన్న కులం..
బల పరీక్ష సమయానికి కుల రాజకీయాలు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 20 మంది దేవర్, 28 మంది గౌండర్, 31 మంది దళిత, 19 మంది వన్నియర్ వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ సెల్వంకు చెందిన దేవర్ వర్గం 8 మంది అల్రెడీ అతని పంచన చేరారు. ఇక మిగిలింది 12 మంది. వీరంతా గతంలో జయ, సెల్వం హయాంలో మినిస్టర్ లుగా పని చేశారు కూడా. దీంతో ప్రస్తుతం వీరంతా పళనీకి హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదు.
మరోవైపు ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఎమ్మెల్యేలు ఏ క్షణాన అయినా యూ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు. రిసార్ట్ నుంచి ఇళ్లకు బయలుదేరిన కొంత మంది ఎమ్మెల్యేలను అటకాయించిన ప్రజలు ఆగ్రహాంతో ఉమ్మేయటం, వారిపై దుమ్మెత్తి పోయటం లాంటి సీన్లు కనిపించాయి. చివరకు పోలీసుల సాయంతో వాళ్లు ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి దాపురించింది. వీటి వెనుక సెల్వం ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు నిజంగానే తలెత్తే అవకాశాలను కొట్టి పారేయలేం అంటున్నారు విశ్లేషకులు.
ప్రభుత్వంపై ధర్మ యుద్ధం ప్రకటించిన సెల్వంను నిలువరించాలంటే అతనితోపాటు, మద్దతుదారులైన 9 మందిపై అనర్హత వేటు వేయించేలా ఈసీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే కు అంత సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బల పద్రర్శన కు ముందే అరవ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం ఎలాంటి అలజడి రేపుతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more