శశికళ మనిషి దారుణ హత్య.. వైరల్ వీడియో | Video of hacking AIADMK ex-councillor to death went viral.

Brutal murder caught on camera in chennai

AIADMK Worker Murder, AIADMK Murder, Tiruvannamalai, Kanakaraj Hack, AIADMK Brutal Murder, Kanakaraj Murder Video, V Kanakaraj, AIADMK Ex-Councillor, CCTV Murder Video, Sasikala Aide Murder

AIADMK worker Kanakaraj hacked to death in Tiruvannamalai Three surrender after hacking. That brutal murder caught on camera.

ITEMVIDEOS: సీసీ కెమెరాలో దారుణ హత్య

Posted: 02/13/2017 08:15 AM IST
Brutal murder caught on camera in chennai

అన్నాడీఎంకే ఎక్స్ కౌన్సిలర్ దారుణ హత్య తమిళనాడులో తీవ్ర కలకలం రేపిది. హత్య చేసిన కొద్దిగంటలకే సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ వీడియో ఉదంతం మీడియాలో ప్రసారం కావటం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు తిరువన్నామలై నగర మాజీ సెక్రటరీ, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ వి.కనకరాజ్‌(40)ను అతి కిరాతంకగా కింద పడేసి కత్తులతో చంపేశారు. 5 కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఈ హత్యకు కారణం అని తేలింది.

నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియోను పోలీసులు విడుదల చేశారు. తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. స్థానిక కార్ఖానా వీధిలోని అరుణాచలేశ్వర ఆలయ సమీపంలో కనకరాజ్‌(40)ను అడ్డగించిన ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.

 

అనంతరం అక్కడ సీసీటీవీని పరిశీలించగా హత్య దృశ్యాలు కనిపించాయి. హత్య చేసింది తామే అంటూ ముగ్గురు నిందితులు (డీఎంకేకు చెందిన కార్యకర్తలు) బాబు(28), రాజా(35), శరవణన్‌(30) పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. రియల్టర్ గా ఉన్న కనకరాజ్ తో ఆర్థిక పరమైన అంశాల్లో తేడా రావడంతోనే నిందితులు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, కనకరాజ్‌ మృతిపట్ల ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు శశికళ ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరోవైపు ఈ వీడియో ఇలా బయటికి వచ్చిందో లేదో వెంటనే వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  V. Kanakaraj  Murder  CCTV Video  

Other Articles