జల్లిక(ప)ట్టు.. ఎద్దు కుమ్మి 8 మంది మృతి | 8 die in bull sports in Tamil Nadu.

8 die in bull sports in krishnagiri

Jallikattu, 8 Killed, Krishnagiri Jallikattu, Jallikattu Mishap, Jallikattu Tamil Nadu, Bull Sports Inia, Bargur Main Road, Jallikattu Mishap, Bargur village, Krishnagiri District

Eight persons was gored to death by a bull and others sustained injuries in the jallikattu held in Bargur village near Krishnagiri District.

జల్లికట్టులో విషాదం.. 8 మంది మృతి

Posted: 02/13/2017 07:30 AM IST
8 die in bull sports in krishnagiri

ఓవైపు తమ సంప్రదాయ క్రీడ‘జల్లికట్టు’ కోసం తంబీలు పోరాటం చేస్తుంటే, మరోవైపు దాని వల్ల నష్టమేనంటూ పలు సంఘాలు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్డినెన్స్ ఇంకా చట్ట రూపం దాల్చేందుకు సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి మద్ధతు ఉండటంతో పలు చోట్ల ఈ క్రీడలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణ గిరి జిల్లాలో జరిగిన జల్లికట్టు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు ఎనిమిది మంది యువకులు జల్లికట్టుతో ప్రాణాలు కోల్పోయారు.

బలుగూరులో నిర్వహించిన క్రీడలో భాగంగా ఒక ఎద్దును లొంగదీసుకునే క్రమంలో, ఒక్కసారిగా దానిపై యువకులు పడిపోయారు. దీంతో, ఊపిరాడక, బెదిరిపోయిన ఆ ఎద్దు తన ప్రతాపం చూపించింది. రంకెలు వేస్తూ, కొమ్ములు విసరడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరి కొంతమంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, తక్షణ చర్యలు చేపట్టాలని, క్రీడను నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పాతిక లక్షల నష్టపరిహారంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగం కోరుతూ రోడెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Tamil Nadu  Krishnagiri  8 Killed  

Other Articles