మహిళ స్నానాన్ని చిత్రీకరించిన హెడ్ కానిస్టేబుల్... Ariyalur head constable films woman bathing in mobile phone

Ariyalur head constable films woman bathing in mobile phone

ariyalur district, head conistable, shekar, police films woman bathing, police beatenup by locals, ariyalur, mobile phone, India news, latest news

A head constable by name shekar went to near by shop, and filmed a woman bathing in his mobile phone, locals caught him and beaten him

మహిళ స్నానాన్ని చిత్రీకరించిన హెడ్ కానిస్టేబుల్...

Posted: 02/09/2017 04:01 PM IST
Ariyalur head constable films woman bathing in mobile phone

అతను ఓ హెడ్ కానిస్టేబుల్, ఎవరైనా తప్పులు చేస్తే వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. అప్పటికీ వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. అయినా దారికి రాకపోతే వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలకు ఉపక్రమించాలి. కానీ తాను పోలీసునన్న సంగతి మర్చిపోయి.. మద్యం మత్తులో జోగుతూనే విధులకు హాజరై.. స్థానికంగా ఓ మహిళ స్నానం చేస్తుండగా, దానిని తన సెల్ పోన్ లో చిత్రీకరించాడు. అతడ్ని దృష్టి మరల్చేందుకు స్థానికులు ఎంత యత్నించినా.. వారిని గమనించలేదు. దీంతో అతడ్ని కిందకు దించిన స్థానికులు అతనికి దేహశుద్ది చేసి చక్కని గుణపాఠం చెప్పారు.

వావరాల్లోకి వెళ్తే.. అరియలూరు జిల్లా వేంగనూరు పోలీస్‌స్టేషనలో శేఖర్‌ (44) హెడ్‌కాని స్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు సాయంత్రం అరియలూరు డీఎస్పీ కార్యాలయ సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. దుకాణం పై భాగానికి వెళ్లిన శేఖర్‌ పక్కింట్లో ఓ మహిళ స్నానం చేస్తుండడాన్ని చూసి తన మొబైల్‌లో చిత్రీకరించసాగాడు. ఇది గమనించిన కొందరు మహిళలు అతడిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్‌ వారి మాటలు వినకుండా వీడియో తీయసాగాడు. మహిళలు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని శేఖర్‌ను చితకబాది అరియలూర్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు శేఖర్‌ను విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles