అల్లుడోరికి కోపం వచ్చింది..! ఎందుకనో తెలుసా..? Modi’s raincoat barb extremely demeaning, shameful: Vadra

Modi s raincoat barb extremely demeaning shameful vadra

PM Modi’s, Robert vadra, sonia gandhi, rahul gandhi, rain coat dig, politics, modi manmohan singh jibe, modi raincoat jibe, robert vadra, vadra modi, Narendra Modi, India news, latest news

Dubbing PM Modi’s raincoat barb as ‘extremely demeaning,’ Robert Vadra said it was shameful for the entire nation that Manmohan Singh had to bear the brunt of PM Modi’s jibe.

అల్లుడోరికి కోపం వచ్చింది..! ఎందుకనో తెలుసా..?

Posted: 02/09/2017 02:56 PM IST
Modi s raincoat barb extremely demeaning shameful vadra

అల్లుడోరికి కోపం వచ్చింది. ఎవరిపైనా..? అన్న మొదటి ప్రశ్న వినిపిస్తుంది..? ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ పైనేనని తెలిస్తే.. ఔరా..? ఏమది ప్రధానిపైనే కోపాన్ని వెల్లగక్కే ధైర్యమా..? ఎవరా అల్లుడోరూ.. ఏమా కథ అంటారా..? మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై నిన్న పార్లమెంటులోని రాజ్యసభ సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీపై సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రా తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. దేశానికి తన అనుభవంతో ఎన్నో మార్గదర్శకాలను తీసుకువచ్చని మాజీ ప్రధాని మన్మోహన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆయనను కించపర్చేలా మాట్లాడటం.. హేయకరమని అన్నారు.

యావేత్ దేశ చరిత్రలో ఒక ప్రధాని మరో మాజీ ప్రధానిపై ఇంతలా చౌకబారు వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఇంతకుమునుపెన్నడూ లేదన్నారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేసిన కృషిని శ్లాఘించాల్సింది పోయి.. అర్థికరంగ నిపుణుడైన మాజీ ప్రధానిపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మోడీని చూసీ ప్రపంచ దేశాలు నవ్వుకుంటాయని అన్నారు. మన్మోహన్ లాంటి ఉన్నతమైన వ్యక్తుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పరిణితికి, గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు.

‘ఇది దేశం మొత్తానికి పెద్ద సిగ్గుచేటు. మోదీ మాజీ ప్రధానిని కించపరిచేలా మాట్లాడారు. అయినప్పటికీ ఎలాంటి మాటల దాడి చేయకుండా ఆయన పరిణితిని చాటుకున్నారు. మొన్న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేసే సమయంలో మాట్లాడుతూ రాహుల్‌ చెప్పిన భూకంపం వచ్చి వెళ్లిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు ప్రజల మనోభావాలను దెబ్బకొడతాయి’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు. మన్మోహన్‌ పై మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi’s  Robert vadra  sonia gandhi  rahul gandhi  rain coat dig  politics  

Other Articles