గవర్నర్ తో సెల్వం భేటీ పూర్తి.. ఏం చెప్పాడు? | Panneerselvam says will hear good news soon.

Panneerselvam after meeting governor

O Panneerselvam, Governor C Vidyasagar Rao, Ch Vidyasagar Rao Panneerselvam, OPS h Vidyasagar Rao Meet, Panneerselvam Press Meet, Panneerselvam Good News

O Panneerselvam, after meeting Governor, says justice will happen, truth will prevail. Talking to the media in Chennai, Panneerselvam said Sasikala is "resorting to dirty tricks to usurp power".

ITEMVIDEOS:గుడ్ న్యూస్ వింటాం: పన్నీర్ సెల్వం

Posted: 02/09/2017 05:44 PM IST
Panneerselvam after meeting governor

తమిళనాడులో వేగంగా మారుతోన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో చెన్నైలోని రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప‌న్నీర్ సెల్వం భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, వారి భేటీ కేవలం 18 నిమిషాల్లోనే ముగిసింది. ఈ షార్ట్ టైంలో ఏం జరిగిందని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఈనేపథ్యంలో బయటికి వచ్చిన సెల్వం వివరాలను మీడియాకు తెలిపాడు. తాను రాజీనామా బలవంతంగా చేయించేదేనని, కుట్రపూరితంగా శశికళ సీఎం సీటులో కూర్చునేందుకు యత్నిస్తోందని వివరించానని భేటీ అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో తెలిపాడు. అంతేకాదు రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించాడు. దీనికి స్పందిన గవర్నర్ 7.30 ప్రాంతంలో తన నిర్ణయాన్ని వెలువరిస్తానని చెప్పినట్లు సమాచారం.

 

అంతేకాదు శశికళ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైతే తాను బలనిరూపణ సిద్ధమన్న సంకేతాలు పంపినట్లు కూడా తెలుస్తోంది. మీడియాతో మాట్లాడుతూ చివర్లో సత్యం వర్థిల్లుతుందని, న్యాయం జరుతుందన్న వ్యాఖ్యలు చేయటం విశేషం. త్వరలోనే అందరూ ఓ మంచి శుభ‌వార్త వింటార‌ని చెప్పారు. తాము ధ‌ర్మం వైపు ఉన్నామ‌ని చెబుతూ, ఎల్ల‌ప్పుడూ ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని, . వీటితోపాటు రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులు, ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు వివ‌రాలను కూడా ఆయ‌న తెలిపిన‌ట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో శశికళ కూడా భేటీ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Ch Vidyasagar Rao  Meet  

Other Articles