కేటీఆర్ ఎక్స్ పీరియన్స్ కవితకు కూడానా? | A Paper Article That Moved MP Kavitha.

Kalvakuntla kavita tweets on sangareddy college problem

Kalvakuntla Kavitha, KTR, KTR And Kavitha, MP K Kavitha Sangareddy College, Kalvakuntla Kavitha Twitter, MP Kavitha Twitter, Kalvakuntla Family Twitter,

KTR and Kavitha solved problems through Twitter. After KTR tweet on School Kid pic, Now Kavitha Shares Sangareddy Inter College Problems.

అప్పుడు కేటీఆర్, ఇప్పుడు కవితక్క

Posted: 02/08/2017 04:06 PM IST
Kalvakuntla kavita tweets on sangareddy college problem

తెలంగాణ రాజకీయ కీలక వ్యవహారాలల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ వారసులు కేటీఆర్, కవితలపై విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, వాటి ద్వారా లాభాలే చేకూరుతుండటంతో ఆరోపణలకు ఆస్కారం లేకుండా పోతుంది. ఓవైపు ప్రత్యక్షంగానే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా పరోక్షంగా సమస్యల పరిష్కారానికి చేసేందుకు వీరివురు ముందుకు రావటం గమనార్హం. ఇక తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.

ఆ మధ్య హైదరాబాదుకు చెందిన సురేన్ దంపతులు ఓ ఫొటోను మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేయగా, ‘గుండెల్ని తాకే ఫోటో ఇది’ అంటూ కేటీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఉదయాన్నే నిద్రలేపడం బాధాకరమని వాళ్ల స్కూల్ టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చేయాలని కేటీఆర్ కు విన్నవించగా, ఆ ఫొటో చూసిన కేటీఆర్ చలించిపోయి విద్యాశాఖతో ఈ విషయమై చర్చిస్తానని హామీ కూడా ఇఛ్చాడు.

ఇక ఇప్పుడు కవిత వంతు వచ్చింది. పేపర్ లో చదివిన ఓ ఆర్టికల్ ను షేర్ చేసిన ఆమె సదరు సమస్యపై అధికారులతో చర్చింది కూడా. విషయం ఏంటంటే... సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఎదుర్కుంటున్న బాధలు వర్ణనాతీతం అంటూ ఆమె ఓ పత్రిక కథనాన్ని పోస్ట్ చేసింది. కళాశాల పక్కనే శ్మశానం ఉండ‌టం, దహన సంస్కారాలు జరిగే సమయంలో పొగ తరగతి గదుల్లోకి రావటం, గ‌దిలో ముక్కు మూసుకొని అవ‌స్థ‌లు ప‌డుతూ పాఠాలు వినటం, పైగా అనారోగ్యం బారిన పడటం ఇలా అందులో ఉండటంతో ఆమె చ‌లించిపోయారు.

 

ఈ వార్తను చదివి షాక్‌కు గురయ్యాన‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి తాను ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడాన‌ంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విద్యార్థినుల దుస్థితి గురించి వివరణ తీసుకుని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తానికి ఇద్దరు వారసులు ఇలా సోషల్ మీడియా బేస్ తోనే సమస్యలన్నీ చకచకా పరిష్కరించుకుపోవటం విశేషమనే చెప్పుకోవాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalvakuntla Kavitha  Twitter  Sangareddy College Isuue  

Other Articles