గుడ్ న్యూస్: నగదు విత్ డ్రా.. పాత రోజులు వచ్చేశాయోచ్..! Cash withdrawal limits to go from March 13: RBI

Back to old days after demonetisation no limits on cash withdrawls

Rs 500 notes, Rs 1000 notes, demonetisation, RBI, Note ban, cash withdrawal, Arun Jaitley, Debit card charges, Reserve bank of India, finance ministry, cashless economy, ditigal payments, RBI governor, Urjit patel, PM modi, debit cards, debit card charges, fake currency

The Reserve Bank of India (RBI) announced that withdrawal limit for savings accounts would be increased to Rs 50,000 a week from February 28. All cash withdrawal limits will be lifted from March 13.

గుడ్ న్యూస్: నగదు విత్ డ్రా.. పాత రోజులు వచ్చేశాయోచ్..!

Posted: 02/08/2017 02:55 PM IST
Back to old days after demonetisation no limits on cash withdrawls

భారత దేశం నుంచి అవినీతి పారద్రోలుతూ, నల్లధనాన్ని రూపుమాపుతూ గత ఏడాది నవంబర్ఎనమితిన కేంద్ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక, చారిత్రక, సాహసోసేత నిర్ణయం పాత పెద్ద నోట్ల రద్దు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. 50 రోజుల పాటు ప్రజలందరూ సంయమనం పాటించాలని, కష్టాలన్నీ ఈ లోగా తీరిపోతాయని కూడా ఆయన చెప్పారు. అయితే నగదు విత్ డ్రాలపై అంక్షలు కూడా పెట్టారు.

ఓ వైపు నగదు విత్ డ్రా చేసుకోవడం కష్టంగా పరిణమించగా, అదే సమయంలో పాత పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రధాని ప్రజలకిచ్చిన మాట కూడా ధాటిపోయినా పరిస్థితుల్లో మార్పు మాత్రం కనబడలేదు. అటు ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్థంభింపజేసినా.. ప్రభుత్వ తీరును తూర్పారబట్టినా.. వ్యూహాత్మక మౌనం పాటించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకులకు మాత్రం దేశ ప్రజలకు ఊరటినిస్తూ నిర్ణయం తీసుకుంది.

నగదు రహిత దేశంగా రూపోందించే క్రమంలో క్యాష్ లెస్ ఎకానీమినీ ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. ఇటీవల కరెంట్ అకౌంట్ దారులకు మాత్రం నగదు విత్ డ్రాలపై ఊరటను కల్పించింది. బడ్జెట్ లో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట లభిస్తుందని వేచి చూసినా.. ఎలాంటి శుభవార్త అందలేదు. దీంతో పెద్దగా నిట్టూర్పు విడిచిన ఖాతాదారులకు ఎట్టకేలకు 124 రోజుల తరువాత నగదు విత్ డ్రాల నుంచి విముక్తి లభించి.. మళ్లీ పాత రోజులు రానున్నాయి. దీంతో పాటు మారో శుభవార్తను కూడా కేంద్రం సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు అందించింది.

ఇప్పటి వరకు వారానికి కేవలం 24 వేల రూపాయల నగదును మాత్రమే ఏటీయం కేంద్రాలలో విత్ డ్రా చేసుకునే సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఈ నెల 20 నుంచి భారత దానిని 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్న్ ఉర్జిత్ పటేల్ ఇవాళ వెల్లడించారు. ఇకపై ఒక వారానికి ఏటీయం కేంద్రాల నుంచి రూ.50 వేలను విత్ డ్రా చేసే వెసలుబాటు కల్పించారు. దీంతో పాటు మార్చి నెల 13 తరువాత అనగా పాత పెద్దనోట్ల రద్దు చేసిన 124 రోజుల తరువాత ఖాతాదారులందరూ పెద్దగా ఊపిరి పీల్చుకోనున్నారని, అ రోజు నుంచి నగదు విత్ డ్రాలపై ఎలాంటి అంక్షలు వుండబోమని అర్బీఐ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urjit patel  RBI  Note ban  cash withdrawal limits  cashless economy  ditigal payments  

Other Articles