సీసీ కెమెరాలో నగ్నంగా మహిళలు.. 11 మంది మృతి... షాక్ తిన్న అధికారులు | Nude Women on CCTV at Delhi Govt-Run Asha Kiran.

Male staff monitor women changing in delhi shelter home

Delhi Commission for Women, at Delhi Govt Asha Kiran, Asha Kiran Home, DCW Swati Maliwal, CC Cameras in Ashram, CC Cameras Asha Kiran, Naked Woman Ashram, Delhi Government Asha Kiran, Asha Kiran Deaths, Ashram Dress Change, Naked women Dead Patients

A surprise visit by Delhi Commission for Women (DCW) chief Swati Maliwal at Delhi Govt-Run Asha Kiran on Saturday found gross violations of human rights, extremely unhygienic toilets and shortage of staff at the government-run shelter home. Women were being made to remove their clothes in the open while being lined up for taking a bath. Shockingly, completely nude women were roaming around in the corridors,” DCW chief Maliwal was quoted.

ఆశ్రమంలో దారుణం.. సీసీ కెమెరాలో నగ్నంగా మహిళలు

Posted: 02/06/2017 01:44 PM IST
Male staff monitor women changing in delhi shelter home

ప్రభుత్వాల నిర్లక్ష్యమో లేక నిర్వాహకుల కక్కుర్తో తెలీదుగానీ ఓ ఆశ్రమంలో జరుగుతున్న నీచ కార్యాకలాపాలు వెలుగులోకి రావటంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఆ ఆశ్ర‌మం తీరుని ప‌రిశీలించిన మహిళా కమిషన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. ముఖ్యంగా మహిళలు బహిరంగంగానే బట్టలు మార్చుకోవటం, పైగా అవి సీసీ కెమెరాల్లో రికార్డు కావటం మరీ దారుణం.

ఆశా కిరణ్‌ అనే ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మహిళలు, పిల్లలు ఉంటున్నారు. గత రెండు నెలల్లోనే సుమారు 11మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా, కొందరు బృందం సభ్యులు ఆ ఆశ్ర‌మానికి వెళ్లి అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. శ‌నివారం రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలించి విస్తుపోయారు.

స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారని చెప్పారు. ఆశ్ర‌మంలో మానసిక విక‌లాంగులైన మ‌హిళ‌లు పూర్తి నగ్నంగా అటు ఇటూ తిరుగుతున్నారని స్వాతి మాలివాల్ చెప్పారు. ఆశ్ర‌మంలోని కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని, వాటిని పురుషులు ఆప‌రేట్ చేస్తున్నార‌ని తెలిపారు. ఈ దృశ్యాలన్నీ చూసి తాము షాక్‌కు గుర‌య్యామ‌ని చెప్పారు. ఆశ్ర‌మంలో పరిశుభ్రత లేద‌ని, అవ‌స‌ర‌మైన సంఖ్య‌లో ఉద్యోగులు కూడా లేరని అన్నారు. అక్క‌డ నివ‌సిస్తోన్న‌ మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, 350 మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మంది మాన‌సిక వికలాంగుల‌ను ఉంచారని, దీనిపై ఇప్పటికే తాము సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చామ‌ని తెలిపారు. 72గంటల్లో త‌మ‌కు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వ‌డ‌మే కాకుండా తాము కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశామ‌ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asha Kiran  CC Cameras  Deaths  Naked Woman  

Other Articles