బ్లాక్ మెయిల్ చేసి మరీ ఎంపీ సీటు ఇప్పించుకున్నాడా? | Did Vijaya Sai Reddy black mailed Jagan?

Vijaya sai reddy about black mailing politics

YSRCP MP Vijaya Sai Reddy, Vijaya Sai Reddy, YS Jaganmohan Reddy, Jaganmohan Reddy Vijaya Sai Reddy, Vijaya Sai Reddy Jagan, YS Jagan Vijaya Sai Reddy, Vijay Sai Reddy Party Change, Vijaya Sai Reddy Black Mail, YS Jagan Black Mail, MP Vijaya Sai Reddy, Vijaya Sai Reddy Interview, Vijaya Sai Reddy TV9 Encounter

YSRCP MP Vijaya Sai Reddy says he never black mailed Chief YS Jagan for Rajya Sabha MP Seat. Denied Party Change Rumours.

జగన్ బ్లాక్ మెయిలింగ్ పై విజయ్ సాయి రెడ్డి

Posted: 02/06/2017 11:13 AM IST
Vijaya sai reddy about black mailing politics

ఎంతో కీలకం అనుకున్న నేతలంతా పార్టీను వీడుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని కార్యకర్తలు ఓపెన్ గా విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. పైగా సలహాలు ఇస్తే పూచీకపుల్లలా తీసిపడేస్తుంటాడన్న విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. మైసూరారెడ్డి లాంటి అనుభవజ్నుడైన నేత కూడా వైసీపీలో ఇమడలేకపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సొంత నేత విజయ్ సాయి రెడ్డి జగన్ పై బ్లాక్ మెయిలింగ్ చేశాడన్న ఓ వార్త పెను దుమారం రేపింది.

అయితే దీనిపై జగన్ అంతరంగికుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి పెదవి విప్పాడు. అలాంటి బుద్ధులు తనకి లేవంటూ క్లారిటీ ఇచ్చే యత్నం చేశాడు. జగన్ ను తాను ఎన్నడూ బ్లాక్ మెయిల్ చెయ్యలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తనకు, జగన్ కుటుంబానికి మధ్య ప్రేమాభిమానాలతో కూడిన అనుబంధముందని, బ్లాక్ మెయిల్ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నాడు. జగన్ అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి, ఆయన రహస్యాలన్నీ తెలిసుండటం చేతనే, రాజ్యసభ సీటును ఇప్పించుకోగలిగారని కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. ఆ వార్తలు నిరాధారమైనవని, ఊహాజనితాలని, త్వరలో అన్ని కేసుల నుంచి నిర్దోషులుగా బయటపడతామన్న నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తోసహా సీబీఐ 74 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి ముద్దాయి జగన్ కాగా, రెండో ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ హోదాలో విజయ్ సాయిరెడ్డి ఉన్నాడు. అయితే ఈ మధ్య సాయిరెడ్డి పార్టీలో క్రియాశీలకంగా లేడని, త్వరలో అధికారపక్షంలో చేరతాడన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్నకు స్పందించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్ ను వీడే సమస్యే లేదంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  MP Vijaya Sai Reddy  YS Jagan  Black Mail  

Other Articles