ఫ్రీ ప్రెటోల్ గెలిచేనా..? లేక ఇంటర్ నెట్టా..? will free petrol win over highspeed broadband services

Will free petrol win over highspeed broadband services

goa, goa elections, goa polls, goa voters, bharatiya janata party, manohar parrikar, goa assembly elections, goa voting, election updates, goa, free petrol, free wi-fi, broadband internet, bjp, congress, india news

goa the state which is going for voting today is bonded with the freebees election promises from political parties. ruling bjp gives highspeed broadband internet service whereas congress gives five litres free petrol to liable students having driing licence.

ఫ్రీ ప్రెటోల్ గెలిచేనా..? లేక ఇంటర్ నెట్టా..?

Posted: 02/04/2017 06:32 PM IST
Will free petrol win over highspeed broadband services

శీర్షక చూడగానే మీరు అసక్తి చూపుతారని తెలుసు.. ఎందుకంటే ఉచిత పెట్రోల్ పై హైస్పీడ్ బ్రాండ్ బ్యాండ్ గెలుస్తుందా..? అంటే ఈ రెండింటికీ మధ్య సంబంధమేంటి..? అంటారని కూడా మాకు తెలుసు. అయితే విషయంలోకి ఎంటరవితే.. అధికార పీఠం కోసం తహతహలాడుతున్న రాజకీయ పార్టీలు ఓట్లర్లు విసురుతున్న గాలమిది. ముఖ్యంగా ఇవాళ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొంటున్న గోవా వాసులు ఎవర్ని అదరించనున్నారు.. ఎవరి హామీలు వారిపై అధిక ప్రభావాన్ని చూపనున్నాయన్నది మరో నెల రోజుల్లో తేలతెల్లం కానుంది.

గోవాలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు ఇవి. పదిలక్షలకుపైగా ఓటర్లు, 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో అధికార బీజేపీకి మరోసారి పట్టం కట్టాలా? లేక మార్పును స్వాగతించాలా? అన్నది శనివారం ఓటర్లు తేల్చబోతున్నారు. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం (2014-15 తలసరి ఆదాయపరంగా), దేశంలో అక్షరాస్యతలో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా. గోవాలోని విద్యావంతులైన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల ద్వారా చాలా గట్టిగానే ప్రయత్నించాయి.

సోషల్‌ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో రవాణా సదుపాయాలు పెంపొందిస్తామని, నార్త్‌ గోవాలోని మోపాలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడం ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ప్రకటించింది. అటు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలను గుప్పించాయి. స్థానిక గిరిజనులను మోసం చేసి మోపాలో భూసేకరణ చేపట్టారని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే మోపాలో భూసేకరణను నిలిపేసి తదుపరి విచారణ చేపడతామని ఒక అడుగు ముందుకేసి ఆప్‌ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa  aam aadmi party  free petrol  free wi-fi  broadband internet  bjp  congress  

Other Articles