ఆ రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్.. అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు goa, punjab sees record voting percentage in high stake battle

Goa punjab sees record voting percentage in high stake battle

punjab, aam aadmi party, goa, goa elections, goa polls, goa voters, punjab voters, punjab assembly elections, parkash singh badal, amarinder singh, shiromani akali dal-bharatiya janata party , bjp, sad, manohar parrikar, goa assembly elections, goa voting, punjab voting, voting begins, voting percentage punjab, voting percentage goa, parkash singh badal, manohar parrikar, narendra modi, sukhbir badal, navjot singh sidhu, evm machine, punjab techinical problem, evm machine technical problem, goa election, punjab election, election updates, goa, punjab, india news

Goa registered a record turnout of 83 per cent in the assembly elections, according to the Election Commission. Punjab, meanwhile recorded an estimated 75 per cent polling in the assembly elections.

ఆ రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్.. అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు

Posted: 02/04/2017 05:55 PM IST
Goa punjab sees record voting percentage in high stake battle

గోవా, పంజాబ్ ఎన్నికలలో ఓటర్లు పండరేపారు. ఆయా రెండు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో తామే గెలుస్తామని అంచనాలు వేసుకున్న అభ్యర్థల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటింగ్ శాతం అనుకున్న స్థాయికన్నా అధికంగా నమోదుకావడంతో తమ గెలుపు అంచనాలపై ఏలాంటి ప్రభావం చూపుతుందోనని అందోళన చెందుతున్నారు. సాధారణంగా 60-65 శాతం పోలింగ్ జరిగితేనే అబ్బా అనే అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఓటింగ్ తో ఉత్కంఠకు గురవుతున్నారు.

గోవా అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పంజాబ్‌లో సైతం 70 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గోవాలో ఎన్నికలు సాధారణంగానే జరిగినా, పంజాబ్‌లో మాత్రం ఈవీఎంలు మొరాయించడం, వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. అయినా కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ నెలలో ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
గోవా, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ తుది వివరాలు తెలిసేసరికి పోలింగ్ శాతం మరికొంత పెరగొచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు ఉండటమే అందుకు కారణం. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ఓటింగ్ బాగా జరిగింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మాల్వా బెల్టులోనే 69 ఉన్నాయి. దాంతో.. ఇక్కడ ఏ పార్టీ గాలి వీస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన ఆప్ కూడా ఇక్కడ గట్టిగా పోటీపడుతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 11వ తేదీన వెలువడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab  goa  aam aadmi party  voting percentage  bjp  sad  congress  

Other Articles