ఎల్ రమణతో భేటీని అంగీకరించిన ఎర్రబెల్లి.. ఎమన్నారో తెలుసా..? yerrabelli slams revanth reddy of blackmailing politics

Yerrabelli slams revanth reddy of blackmailing politics

cash for vote, Yerrabelli Dayakararao, revanth reddy, chandrababu naidu, ttdp president, l. ramana, blackmail, Tdp, Trs, Bjp, politics

MLA Yerrabelli Dayakar Rao alleges ttdlp leader revanth reddy is blackmailing TDP president and AndhraPradesh Chief Minister Chandrababu Naidu in cash for vote case, that he will turn as approver

ఎల్ రమణతో భేటీని అంగీకరించిన ఎర్రబెల్లి.. ఎమన్నారో తెలుసా..?

Posted: 02/04/2017 05:19 PM IST
Yerrabelli slams revanth reddy of blackmailing politics

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ ప్రచారం చేయడంలో రేవంత్ దిట్ట అని, అలాంటి వ్యూహాలతోనే ఎదుగుతానని భ్రమిస్తున్నాడని ఎర్రబెల్లి మండిపడ్డారు. తను మళ్లీ టీడీపీలో చేరబోతున‍్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. నిరాధారమైన వార్తను సృష్టించి రాజకీయంగా బద్నాం చేయటం సాధ్యం కాదని ఎర్రబెల్లి శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి మాట్లాడిన విషయం నిజమేనని అంగీకరించారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైందన్నారు. తమ భేటీకి రాజకీయాలు ఆపాదించడం అర్థరహితమని చెప్పారు. రేవంత్ రెడ్డిది మొదట్నుంచీ సంకుచిత మనస్తత్వం అన్నారు. రాత్రిపూట ఎవరు ఎవరిళ్లకు వెళతారో, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ బీజేపీ మొదలుకుని ఎన్ని పార్టీలు మారారో ఆందరికీ తెలుసిందేనని ఎర్రబెల్లి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles