జనసేన తెలీదు.. పవన్ పార్టీ తెలుసు: జయసుధ | Jayasudha Don't Know Pawan Janasena.

Jayasudha comments on pawan kalyan janasena

Actress Jayasudha, Janasena Party, Pawan kalyan, Jayasudha Pawan kalyan, Jayasudha Janasena, Janasena Pawan kalyan, Jayasudha Party Change, Actress Comments on Janasena, Jayasudha TDP Party

Actress Jayasudha Comments on Pawan Kalyan Janasena Party. She explains that she always knew Pawan Kalyan‘s party, not by the party name, but by his name as Pawan’s party. For her, it’s Pawan Kalyan’s party. Jana Sena is an entirely new name and she thinks that a political party’s name would be if use in the elections.

జనసేనపై సీనియర్ నటి కామెంట్స్

Posted: 01/28/2017 08:23 AM IST
Jayasudha comments on pawan kalyan janasena

సినిమాల్లో బిజీగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా కొనసాగుతోంది సహజనటి జయసుధ. ఆ మధ్య టీఆర్ఎస్ లో చేరతారనే పుకార్లు రేగినప్పటికీ, వాటిని ఆమె ఖండించి చివరకు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు . తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పునాదులు లేపుకుంటున్న పవన్ జనసేన పార్టీ వైపు నేతలు మళ్లే పరిస్థితులు నెలకొనటంతో జయసుధను కూడా అభిప్రాయం అడిగారు. అయితే జనసేన ఎవరి పార్టీ?' అని తిరిగి మీడియానే ఆమె ప్రశ్నించడంతో బిత్తరపోవడం అందరి వంతు అయ్యింది.

కాంగ్రెస్ లో కొనసాగుతున్న మీరు భవిష్యత్ లో ‘జనసేన’ లో చేరే అవకాశం ఉందా? అంటూ మీడియా ప్రతినిధి జయసుధను ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానమిస్తూ, 'జనసేనా? ఆ పార్టీ ఎవరిది?' అని ప్రశ్నించారు. దీంతో 'అది పవన్ కల్యాణ్ పార్టీ' అని చెప్పగానే.. 'అవునా? పవన్‌ పార్టీ పేరు ‘జనసేన’ అని నాకు తెలియదు' అని చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ అంటే గుర్తుకొస్తుంది తప్ప ఆ పార్టీ పేరు తనకు తెలియదని ఆమె అన్నారు. అంతేకాదు జనసేన అంటే అదేదో ఎన్నికల ముందు రాబోతున్న కొత్త పార్టీ కాబోలు అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. గతంలో పవన్ రాజకీయ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆమెకు నిత్యం వార్తల్లో వచ్చే జనసేన పేరు తెలీదంటే నమ్మటం కొంచెం టూమచ్ గా అనిపించకమానదు.

రాజకీయాల్లో తాను అందర్నీ సపోర్ట్ చేస్తానని చెప్పారు. అయితే రాజకీయాల్లో కష్టపడి పని చేసినవారే గెలుస్తారని ఆమె తెలిపారు. 2009 ఎన్నికలకు ముందు అందరూ తనను చిరంజీవి పార్టీలో చేరుతారా? అంటూ ప్రశ్నించేవారని, కొన్ని నెలల తరువాత ఆయనే కాంగ్రెస్ లో చేరారని ఆమె అన్నారు. ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీలోనే కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan kalyan  Jayasudha  

Other Articles