వాట్సాప్ లో హైదరాబాద్ గురించి ఫేక్ న్యూస్ వైరల్ | Hyderabad Alert fake news viral.

Whats app fake news viral about hyderabad alert

Hyderabad Alert, Whats app, Fake News, V3S Mall Attack, V3S Mall Mock Drill, V3S Mall Terror Attack Fake, Hyderabad Alert Fake News, Hyderabad Terror Alert Whats App, Whats App Hyderabad Fake News, Hyderabad High Alert, Fake News

Terrorist attack at V3S Mall, Delhi. 3 terrorist killed and 2 arrested. Totally fake news. It was a Mock Drill Conducted by CRPF. Fake News Viral in Whats app, no high alert in Hyderabad. Hyderabad Alert fake news viral in Whats app.

వాట్సాప్ లో ఆ ఫేక్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది

Posted: 01/28/2017 08:01 AM IST
Whats app fake news viral about hyderabad alert

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా అందరి చూపు భాగ్యనగరం వైపే ఉంటుంది. దారుణ నరమేధాన్ని సృష్టించే ఉగ్ర రాక్షసులకు బీజాలు ఇక్కడి నుంచి పడుతున్నాయన్న వార్తలు ఎప్పటికప్పుడు నగర వాసులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఎస్‌ఐ) జాగరూకతతో, చురుకుగా వ్యవహరించడంతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లకు, దేశంలోని ఇతర ప్రాంతాలకూ ముప్పు తప్పిన విషయం తెలిసిందే.

ఇక సోషల్ మీడియా పుణ్యమాని న్యూస్ ఛానెళ్ల కంటే ముందే వార్తలు పాకిపోతున్నాయి. ఒకనోకదశలో దానిపై స్పష్టత లేకపోయినా వైరల్ చేసేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లోని ఓ మాల్ లో ఉగ్రదాడి, హైదరాబాద్ హైఅలర్ట్ అంటూ ఓ ఫేక్ న్యూస్ వాట్సాప్ లో శుక్రవారం సాయంత్రం అంతా చక్కర్లు కొట్టింది. అందుకు సంబంధించి ఓ వీడియో అంటూ కూడా పెట్టేశారు. నిజానికి అది ఒక మాక్ డ్రిల్. రిపబ్లిక్ డే సదర్భంగా నిర్మాణ్ విహార్ లోని వీ3ఎస్ ఈస్ట్ మాల్ లో సీఆర్పీఎఫ్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దానిని మీడియా కూడా చిత్రీకరించింది.

అంతే ఆ వీడియోను పట్టుకుని ఉగ్రదాడి ముగ్గురు తీవ్ర వాదులు మృతి, ఇద్దరి అరెస్ట్ అని చెబుతూ హైదరాబాద్ లో హైఅలెర్ట్ ప్రకటించారంటూ వార్త బయలుదేరింది. అంతటితో ఆగకుండా జనసందోహం ఎక్కువగా ఉండే 14 పేర్లను తీసుకుని ఆ ప్రదేశాలలో ఈరోజు(శనివారం) ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఫేక్ న్యూస్ వైరల్ చేశారు కొందరు. దీంలో లేనిపోని భయాలు రేపటం మంచింది కాదని పలువురు చెబుతున్నారు. మరోవైపు న్యూస్ ఉత్తదే అయినా జాగ్రత్తలో ఉండటంలో మాత్రం తప్పేం లేదు అని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  High Alert  Delhi  Mall  Attack  Fake News  

Other Articles