ప్రత్యేక పోరులో పాల్గోన్నారో..! విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరికలు police, college management text messages to parents

Police college management text messages to parents

jallikattu, ordinance, state government, central government, jana sena, YSRCP, desh bachvo, tollywood, chandrababu, special status, vizag, rk beach

Andhra Pradesh Police and College managements send text messages to parents stating do not send their ward to social media arranged special status protests

ప్రత్యేక పోరులో పాల్గోన్నారో..! విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరికలు

Posted: 01/26/2017 11:38 AM IST
Police college management text messages to parents

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, విజయవాడ కృష్ణా తీరం, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీల్లో నవ్యాంధ్రకు చెందని యువకులు భారీ సంఖ్యలో వచ్చి నిరసన కార్యక్రమాలలో పాల్గోనాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ దేశ్ బచావో పేరుతో ఇచ్చిన పిలుపుతో పాటు ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇచ్చిన క్యాండిల్ నిరసన కార్యక్రమాలకు ధీటుగా అటు పోలీసులు కూడా సోషల్ మీడియా అనుసంధానంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

నవ్యాంధ్ర భవిత కోసం, తమ భవిష్యత్తు కోసం రాష్ట్రానికి చెందని వివిధ పార్టీల నేతలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పిలుపునివ్వడం, హోదాతో వచ్చే ప్రయోజనాలను ఇప్పటికే రాష్ట్ర యువతకు వివరించడంతో.. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పెద్ద ఎత్తును యువత కదిలివచ్చే అవకాశముందని తెలుసుకున్న పోలీసులు.. సామాజిక మాద్యామాల ధ్వారా,. విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు వార్నింగ్ ఇస్తున్నారు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనకుండా చూడాలని పోలీసులతో పాటు వర్శిటీల యాజమాన్యాలు సోషల్ మీడియాతో పాటు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు టెక్ట్స్ మెసేజ్ లు పంపుతున్నాయి.

"తల్లిదండ్రులారా, దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న ఆహ్వానాలను చూసి స్పందించవద్దని మీ పిల్లలకు చెప్పండి. ముఖ్యంగా విద్యాభ్యాసం చేస్తూ, ఈ తరహా నిరసనల్లో పాల్గొంటే సరిదిద్దుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు" అని గీతమ్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పేరిట మెసేజ్ లు వచ్చాయి. ఇదే తరహాలో వివిధ ప్రైవేటు వర్శిటీలు, కాలేజీలు, పోలీసుల నుంచి మెసేజ్ లు వస్తున్నట్టు సమాచారం. హోదా ఆందోళనల్లో పాల్గొంటే అవాంఛనీయ పరిణామాలు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles