వైరల్ వీడియో: భార్యపై కస్సుమన్న అధ్యక్షుడు ట్రంప్.. President Trump's wife Melania looks traumatised in viral video

People can t get over melania trump s expression in viral inauguration clip

Melania Trump, Donald Trump, Donald Trump Inauguration, #FreeMelania, United States of America, media, protests, US media, women million march

Captured during a speech at the US President ceremony, the clip and several versions of it going viral, shows Melania's smile turn into a scowl the second President Trump looks away from her. People have even started a #FreeMelania campaign on Twitter since.

ITEMVIDEOS: వైరల్ వీడియో: భార్యపై కస్సుమన్న అధ్యక్షుడు ట్రంప్..

Posted: 01/26/2017 10:53 AM IST
People can t get over melania trump s expression in viral inauguration clip

అమెరికా అధ్యక్షుడిగా గెలుపోందిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే అగ్రరాజ్యం పరిపాలనా బాధ్యతలను అంతకుముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి స్వీకరించిన విషయం తెలిపిందే. ఆయన ఎన్నికైనప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసే వరకు అమెరికాలోని పలు వర్గాల ప్రజలు అయనకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను చేపడుతూనే వున్నారు. ఈ క్రమంలో జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అగ్రరాజ్యంలోని మహిళామణులు లక్షలాధిగా రోడ్డపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

అయితే వారిప్పుడు కోత్త ప్రచారానికి తెరతీశారు. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా తీసిన ఓ స్వల్ప నిడివి గల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దానికి కార‌ణం ఈ స‌మయంలో ట్రంప్‌ భార్య కన‌ప‌రిచిన‌ హావ‌భావాలే. ట్రంప్ భార్య మెలానియా ఒక ఫొటోలో చిరున‌వ్వులు చిందిస్తూ క‌న‌ప‌డ‌గా, మ‌రో ఫొటోలో విచారంగా క‌నిపించారు. ఆ స‌మ‌యంలో త‌న భార్య‌ మెలానియాను ట్రంప్‌ వెన‌క్కి తిరిగి ఏదో అన‌డం కార‌ణంగానే, ఆమె మొహంలో భావాలు మారిపోయాయని తెలుస్తోంది.

ట్రంప్ నుంచి మెలానియాకు విముక్తి క‌ల్పించండి అంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ట్రంప్‌కు వ్య‌తిరేకంగా ఆ దేశంలో ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్న వేళ ఇటువంటి ఫొటో మ‌రోసారి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెలానియాపై నెటిజ‌న్లు సానుభూతి చూపిస్తూ ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మ‌ర్వ్ వీన్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోనే 65 వేల‌కుపైగా లైక్స్‌, 50 వేల‌కుపైగా రీట్వీట్స్ వ‌చ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles