రక్షణ మంత్రిని అందుకే తొలగిస్తున్నారా? | People want Manohar Parrikar back in Goa.

Defence minister manohar parrikar sent back to goa

Defence Minister, Manohar Parrikar, Manohar Parrikar back to Goa, Goa 2017 Elections, Manohar Parrikar Laxmikant Parsekar, Amith Shah Manohar Parrikar, Goa Next Chief Minister, Parrikar Goa CM

Next Goa Government Will Function Under Manohar Parrikar's Leadership, BJP Chief Amit Shah, Goa party's state chief Vinay Tendulkar confirmed it.

ఆ కేంద్రమంత్రికి ఇక ఉద్వాసన తప్పదా?

Posted: 01/25/2017 08:06 AM IST
Defence minister manohar parrikar sent back to goa

గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు దాదాపు తెరపడినట్లే అనుకోవాలి. ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ను తిరిగి గోవాకే పంపించేయాలన్న ఆలోచనతోనే కమల అధిష్టానం బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్ర‌నేత‌ల చేస్తున్న వ్యాఖ్య‌లే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా గోవాలో మాట్లాడుతూ త‌దుప‌రి ప్ర‌భుత్వం మ‌నోహ‌ర్ పారిక‌ర్ నేతృత్వంలో ప‌నిచేస్తుంద‌ని పేర్కొన్నాడు. దీంతో దాదాపు పారికర్ సీఎం అవ్వటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు విన‌య్ టెండూల్క‌ర్ కూడి ఇటువంటి వ్యాఖ్య‌లే చేశాడు కూడా. మ‌నోహ‌ర్ సేవ‌లు రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని అన్నారు. పారిక‌ర్‌కు రాష్ట్రంతో మంచి సంబంధాలున్నాయ‌ని, ఆయ‌న సేవ‌లు రాష్ట్రానికి చాలా అవ‌స‌ర‌మ‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని పేర్కొన్నాడు. అయితే సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలే నిర్ణ‌యిస్తార‌ని తెలిపాడు.

కాగా, పార్టీలన్నీ గోవాను చాలా కీలకంగా భావిస్తాయి. అలాంటి రాష్ట్రంలో బీజేపీ గత ఎన్నికల్లో పారికర్ సారథ్యంలోనే కాషాయపు జెండాను ఎగరవేసింది. అందుకే ఈ దఫా కూడా ఆయన సారథ్యంలోనే ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ఇన్ ఛార్జీగా ఉన్న నితిన్ గడ్కరీ వైఖరి మాత్రం మరోలా ఉంది. పారికర్ పేరును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని, అనవసరంగా ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా నిర్ణయించలేదని అంటున్నాడు.

త్వ‌ర‌లో గోవాలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బీజేపీ మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) తో కలిసి పొత్తుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. మరోవైపు శివసేన, గోవా సురక్షమంచ్ లు కూడా బరిలో దిగుతున్నాయి. గోవాలో గనక గెలుపు బావుట ఎగరేస్తే మాత్రం పారిక‌ర్‌కే సీఎం ప‌గ్గాలు అప్ప‌గించేందుకు అధిష్ఠానం దాదాపు డిసైడ్ అయ్యిందంట.

బాంబే ఐఐటీలో మెటాలుర్జికల్ ఇంజనీరింగ్ చదిన పారికర్ మొట్టమొదటి ఐఐటీ గ్రాడ్యుయేట్ సీఎంగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆపై వరుసగా బీజేపీని గెలిపిస్తూ వస్తున్న పారికర్ 2007 ఎన్నికల్లో ఓడిపోయాడు. తిరిగి 2012 లో గోవాను మళ్లీ బీజేపీ కైవసం చేసుకోగా, పారికర్ సీఎం అయ్యాడు. 2014 నవంబర్ లో రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీని తొలగించి ఆ స్థానంలో పారికర్ ను నియమించుకున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ. కీలకమైన సర్జికల్ స్ట్రైక్స్ ఈయన ఆధ్వర్యంలోని జరిగాయి కూడా. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  2017  Manohar Parrikar  Chief Minister  

Other Articles