ఏయిర్ ఏసియా టూ అండ్ ఫ్రో డిసౌంట్ ఆఫర్ AirAsia India offers 50% discount on round trips

Airasia india offers 50 discount on round trips

AirAsia India, discount offer, round trips, airasia.com, AirAsia mobile App, Air warfare, budget passenger carrier

Budget passenger carrier AirAsia India has started a discount offer of 50 per cent on the return leg of round trips booked via its website and mobile-based application (App).

ఏయిర్ ఏసియా టూ అండ్ ఫ్రో డిసౌంట్ ఆఫర్

Posted: 01/24/2017 05:49 PM IST
Airasia india offers 50 discount on round trips

చౌకధర విమానయాన పోటీలలో భాగంగా గత నాలుగు నెలలుగా వరసగా ఢిసౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను అకర్షిస్తున్న బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఒక ట్రిప్ కు మాత్రమే డిస్కౌంట్ ను అందించే సంస్థ.. ఇప్పుడు తిరుగు ప్రయాణానికి కూడా కలసి డిస్కౌంట్ అఫర్ ను ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ను ఎంజాయ్ చేయాలంటే కంపెనీ వెబ్సైట్, మొబైల్ ఆధారిత తమ అప్లికేషన్లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఏయిర్ఏసియా పేర్కొంది.
 
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద తీసుకున్న టిక్కెట్లు వర్తించనున్నాయి. ఏయిర్ఏసియా ఇండియా విమానాలు తిరిగే అన్ని విమానాలకు, అన్ని మార్గాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 2017 జనవరి 23 నుంచి 29 వరకు ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ లేదా ఏయిర్ఏసియా.కామ్లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.కంపెనీ విమానాలు నడపబోతున్న శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఇది వర్తించనుందని కంపెనీ తెలిపింది.  ఫిబ్రవరి 19 నుంచి శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఎయిర్లైన్ విమానాలు నడుపనుంది. బెంగళూరు, న్యూఢిల్లీ రెండు హబ్లుగా 11 ప్రాంతాలకు ఈ ఎయిర్లైన్ తన సర్వీసులను అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles