రిసార్ట్ లో టీడీపీ ఎమ్మెల్సీ మనుషుల రచ్చ. చిందులు.. ఆపై చితకబాదుడు | MLC Satish aides attack on resort employees.

Tdp mlc aides attack on resorts staff

MLC Annam Satish, TDP MLC attack, TDP leader Satish attack, Bapatla haritha resorts, TDP MLC HUl Chul in resorts, Annam Satish Prabhakar, Producer Koratala Sandeep, MLC attack on bar, Guntur MLC attack

Guntur TDP MLC Annam Satish's men attack on haritha resorts manager and employees.

రిసార్ట్ లో టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుల వీరంగం.. దాడి

Posted: 01/07/2017 10:26 AM IST
Tdp mlc aides attack on resorts staff

ఏపీలో అధికార పక్షంను సొంత నేతల చేష్టలు ఇబ్బందులను తెచ్చి పెడుతున్నాయి. మరో తెలుగు తమ్ముడు వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. బాపట్ల బీచ్ లో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. సూర్యలంక బీచ్ లోని హరిత రిసార్ట్స్ లో రెచ్చిపోయి దాడికి దిగారు.

సినీ నిర్మాత కొరటాల సందీప్ పుట్టిన రోజు వేడుక హరిత రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడుకకు సతీష్ కూడా హాజరయ్యారు. బీచ్ లో వేసిన క్యాంప్ ఫైర్ కు ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ అక్కడి సిబ్బందిపై దాడి చేసి చితకబాదారు. అంతేకాదు వేడుకకు వచ్చిన అతిథులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకానోక దశలో రెచ్చిపోయిన వారు డిప్యూటీ మేనేజర్‌ శ్రీనివాస్‌ ను ఓ గదిలోకి లాక్కెళ్లి మరీ చితకబాదాడంట. మొత్తం ఐదుగురిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయటానికి వెళ్లితే తమను ఉదయం దాకా స్టేషన్ లోని ఉంచారని, దాడి గురించి చెబుతున్నా పోలీసులు స్పందించలేదని రిసార్ట్స్ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు విలేఖరులకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్సీ గతంలో కూడా విలేకర్లతో దురుసుగా ప్రవర్తించారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ నిర్మాణంలో అక్రమాలపై ఓ విలేకరి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్జీ దాఖలు చేయగా, తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన, వేషాలు వేస్తే తాటతీస్తానంటూ ఈయనగారు బెదిరించారు కూడా. ఇక తాజా ఘటనలో విమర్శలు ఎదుర్కుంటున్న నిర్మాత కొరటాల సందీప్‌ కూడా గతంలో ఓ లాడ్జిలో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇక వరుసగా కార్పోరేటర్ విమానంలో ఓ స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించడం.., చింతమనేని-ఎమ్మార్వో వనజాక్షి వివాదం.., గుంటూరు మున్సిపల్ చైర్మన్ జానీమూన్-మంత్రి రావెల మధ్య గొడవ.., గుడివాడలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌లో కాల్పులు జరిపటం ఇలా టీడీపీ నేతలు వివాదాలతో విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP MLC  Annam Satish Prabhakar  Haritha Resorts  attack  

Other Articles