ఒబామా చివరి క్షణాలు.. సంచలన వ్యాఖ్యలు | Obama criticizes Vladimir Putin.

Obama tells republicans putin is not on our team

Barack Obama, Vladimir Putin, Obama last minutes as President, Obama last interview, Putin not on our team, Obama criticize Putin, Putin Donald Trump, Donald Trump Obama, Republicans trust Putin, Putin most dangerous, Moscow's meddling

President Barack Obama said Friday that Vladimir Putin was "not on our team" and expressed concern that some Republicans are siding with the Russian leader on accusations of Moscow's meddling in November's election.

పోతూ పోతూ... పుతిన్ ను ఏసుకున్నాడు

Posted: 01/07/2017 09:50 AM IST
Obama tells republicans putin is not on our team

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ దిగిపోయే ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మరో అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను నమ్మొద్దంటూ అమెరికన్లకు పిలుపునిచ్చాడు. ఎన్నికల్లో పుతిన్ తో చేతులు కలిపి ట్రంప్ హ్యాకింగ్ కు పాల్పడ్డాడంటూ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ ఓటమితో ఆయన మరింత కఠినంగా మాట్లాడినట్లు అర్థమౌతోంది.

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదు. గతంలో కూడా పుతిన్ చేపట్టే చర్యలపై ఎప్పుడూ నాకు నమ్మకం ఉండేది కాదు. పుతిన్ మన(అమెరికా) టీం సభ్యుడు కాదు. కానీ, అమెరికన్లు ఆయనకు మద్దతు ఇస్తుండటం, ఆందోళన కలిగిస్తోంది’’ అని అన్నాడు. అయితే ఆ అమెరికన్లు కేవలం రిపబ్లికన్లు మాత్రమే అని కూడా తేల్చాడు.

ఇతర దేశాల అధినేతలపై ఆధారపడటం అమెరికా భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు. డెమొక్రాటిక్ పార్టీ నేతల కంటే పుతిన్ నే ట్రంప్ ఎక్కువగా విశ్వసిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా పుతిన్ ప్రచారం చేయించారని మండిపడ్డారు. అయితే హ్యాకింగ్ అంశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదని, సరైన ఫలితాలు వచ్చాయని ట్రంప్ పేర్కొన్నాడు. తాను బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోగా సైబర్ సెక్యూరిటీ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Vladimir Putin  Donald Trump  

Other Articles