సైకిల్ లో ఏముంది? సింబల్ పై షాక్ తప్పదేమో! | Fight over cycle symbol reaches the Election Commission.

Election commission may freeze cycle symbol

Samajwadi Party feud, Mulayam Singh Yadav, Akhilesh Yadav, cycle symbol, SP Cycle War, Cycle politics, Election Commission Cycle Symbol, SP Cycle Complaint, Uttar Pradesh Politics

Samajwadi Party feud Mulayam Singh Yadav, Akhilesh Yadav in tug-of-war for cycle symbol.

సైకిల్ సమరంపై సస్పెన్స్ కంటిన్యూ...

Posted: 01/03/2017 08:12 AM IST
Election commission may freeze cycle symbol

సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన సైకిల్ సమరం యూటర్న్ తీసుకోనుంది. ములాయం వర్సెస్ అఖిలేష్ వర్గాలుగా చీలిపోవడంతో పార్టీ గుర్తు సైకిల్‌ పై ఎన్నికల సంఘంను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తనకు కేటాయించాలని ఆ పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఈసీని కలిసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ మరియు నటి జయప్రద కూడా ఆయన ఈసీని కలిసి అఖిలేష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు పార్టీ గుర్తుపై సర్వాధికారాలు మావేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో యూపీలోని అఖిలేష్ వర్గం పార్టీ గుర్తును దక్కించుకునేందుకు పావులు కదిపే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం రాంగోపాల్ యాదవ్, కొందరు ఎమ్మెల్యేలు కమీషనర్ ను కలవనున్నారు. అయితే సమస్య పరిష్కారానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టోచ్చని తెలిపిన కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషీ సైకిల్ సంగ్ధిగ్ధం కొంత కాలం కొనసాగొచ్చన్న సంకేతాలు అందజేశాడు.

ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇప్పుడు ఇరు వర్గాలకు చెందిన వారు అఫిడవిట్లు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. తమ మద్దతుదారుల సంతకాలు సేకరించి ఆ అఫిడవిట్ కు జతచేయాలని, మెజారిటీ ఎవరికి ఉంటే వారికి పార్టీ చిహ్నాన్ని కేటాయిస్తారని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమై ముగిసేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూపీలో ఇరు వర్గాలకు మద్దతు ఎక్కువగానే ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సమయం కూడా లేదని ఆయన చెప్పారు.

ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘం కొంత కాలం ఈ గుర్తును ఎవరికీ కేటాయించకుండా, రెండు వర్గాలకు కొత్త గుర్తులను కేటాయించే అవకాశముందని మరో అధికారి ఒకరు తెలిపారు. పొత్తుల విషయానికొస్తే 110 సీట్లను కోరుతున్న కాంగ్రెస్ అఖిలేష్ వర్గానికి మద్ధతు ఇచ్చే అంశంపై సమాలోచనలు చేస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా యువనేతకే సపోర్ట్ అని ప్రకటించింది కూడా. ఇక అంతర్ పరిణామాలతో లాభపడాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఏదీ ఏమైనా ముసలం సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిగించేలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles