అన్నాడీఎంకే పగ్గాలను అలవోకగా చేపట్టిన శశికళ... సీఎం పీఠం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తుంటే. ఏ క్షణమైనా ఆమె సీఎం బాధ్యతలను చేపట్టే అవకాశం ఉన్నట్లు అర్థమైపోతుంది. అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఏకంగా ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేయటం, అందులో చిన్నమ్మను సీఎం కావాలంటూ విజ్నప్తి చేయటం జరిగిపోయాయి. అమ్మ జయలలిత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి శశికళే సరైన వ్యక్తి అని నాలుగు పేజీల ప్రకటనలో తెలిపారు.
పార్టీ ఒకరి చేతిలో, ప్రభుత్వం మరొకరి చేతిలో ఉంటే రెండు పవర్ సెంటర్లు ఉంటాయని... ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని చెప్పారు. శశికళ వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ప్రకటనలో విన్నవించారు. ముగ్గురు మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆమె వెంట ఉన్నట్లు ఆయన స్పష్టంగా అందులో పేర్కొన్నాడు. మరోవైపు, అన్నాడీఎంకే విడుదల చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంతవరకు స్పందించలేదు.
బలపరీక్ష తప్పదా?
ఇక పన్నీరు సెల్వం శాసనసభలో బలనిరూపణకు సిద్ధపడాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. శాసనసభను సమావేశపరచాలని కూడా సూచించింది. శశికళ సీఎం అవుతారని ఆ రాష్ట్ర మంత్రులు కొందరి నుంచి సంకేతాలు రావడం విశేషం. ఇప్పుడు డీఎంకే కూడా పన్నీర్ సెల్వం బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేయటంతో మరోసారి తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి సందట్లో సడేమియా అన్నట్లు ఈ ఊపులోనే శశికళకు పట్టం గట్టేందుకు సర్వం సిద్ధమైపోయింది.
శశికళకు షాక్...
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా శశికళా నటరాజన్ కు ఎన్నికయ్యే అర్హత లేదంటూ జయలలిత మరణం నుంచి చెబుతున్న ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళపుష్ప ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని, బరిలో ఉన్నానని గత వారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి చేసిన శశికళా పుష్పకు మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యే అర్హత శిశకళా నటరాన్ కు లేదని చెబుతూ, ఆ పార్టీ ఎంపీ శశికళపుష్ప వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు డిస్మిస్ చేసింది. అన్నాడీఎంకేలో పదవుల నియామకంపై ప్రశ్నించే శశికళపుష్ఫ, ఆమె భర్తకు లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more