అదిరిపోయే న్యూఇయర్ ఆఫర్ తో.. ఎయిరిండియా Air India New Year Sale offer at Rs. 849 all inclusive

Air india new year sale offer at rs 849 all inclusive

Air India, Air India offer, Air India new year sale, Air India discount, Air India tickets, Rs 849 tickets, new year sale,

The offer is applicable on one-way journeys in economy class on select sectors and select flights within India operated by Air India/Alliance Air, the airline said on its website.

అదిరిపోయే న్యూఇయర్ ఆఫర్ తో.. ఎయిరిండియా

Posted: 12/27/2016 04:14 PM IST
Air india new year sale offer at rs 849 all inclusive

విమానయానాన్ని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర విమానయాన శాఖ ప్రయత్నాలు ఫలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఏషియా న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 917 రూపాయలకే విమానయాన్ని కల్పిస్తుండగా, తాజాగా ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా అదే తరహాలో మరో ఆపర్ ను ప్రకటించింది. ఏయిర్ ఏషియా కన్నా తక్కువ ధరలో నిర్ధేశిత మార్గల్లో ప్రయాణించే అవకాశాన్న కల్పిస్తుంది.

తమ కస్టమర్లతో పాటు విమానయానం చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన నిర్ధేశిత మార్గాలలో న్యూఇయర్ స్కీమ్ కింద వన్-వే ఎకనామిక్ క్లాస్ టిక్కెట్లు రూ.849కే అందించనున్నట్టు తెలిపింది. దీనిలోనే అన్ని చార్జీలను కలిపి ఉంటాయని పేర్కొంది. ఈ నెల 31 వరకు ఈ స్కీం కింద కస్టమర్లు తమ టికెట్లను బుక్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది.

ఎయిర్ ఇండియా న్యూఇయర్ అపర్ కింద టిక్కట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు వచ్చే ఏడాది అనగా.. 2017 జనవరి 15 నుంచి 2017 ఏప్రిల్ 30 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తించనుంది. చెన్నై-కోయంబత్తూర్, బెంగళూరు-హైదరాబాద్ మార్గాలలో వన్ వే చార్జీ రూ.849కు అందుబాటులో ఉంచుతున్నట్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక అ తరువాత ఈ న్యూఇయర్ సేల్ కింద కవర్ అయ్యే మార్గాలు బెంగళూరు-చెన్నైకు రూ.1,199, ముంబాయి-గోవా రూ.1,499, ముంబాయి-బెంగళూరుకు రూ.1,599, శ్రీనగర్-ఢిల్లీకి రూ.1,999కు టిక్కెట్ ధర ఉండనుంది.

ఇతర మార్గాలు గోవా-ఢిల్లీకు రూ.2,999, గోవా-చెన్నైకు రూ.2,199 టిక్కెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్ కేవలం ఎంపికచేసిన సెక్టార్స్పై ఎకనామిక్ క్లాస్లో వన్-వే ప్రయాణాలకు మాత్రమే వర్తించనుంది. గ్రూప్ బుకిం‍గ్స్కు ఇది వర్తించదని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా ఎయిర్ ఇండియా ఆపర్ నేపథ్యంలో ఇతర ఎయిర్ లైన్స్ గతంలో తాము ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్లను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  New Year Sale  Tickets  air india offer Air travelling  Air tickets  

Other Articles