నోట్ల రద్దు కంటే దారుణమైన నిర్ణయం రాబోతుందా? | Modi Economical strike not stopped with Demonetization.

Demonetisation not last action against corruption

NITI Ayog, PM Naredra Modi, NITI Ayog vice-chairman, Arvind Panagariya, Demonetization Decision, Modi Demonetization Decision, Arvind Panagariya Demonetization, Arvind Panagariya Modi, Demonetization not last action

NITI Ayog vice-chairman Arvind Panagariya syas Demonetization not last action against corruption:

నోట్ల రద్దు కాదు.. అంతకు మించి మరొకటి

Posted: 12/23/2016 08:27 AM IST
Demonetisation not last action against corruption

దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపి ప్రజలను తీవ్రంగా ఇక్కట్లకు గురిచేస్తోంది మోదీ నోట్ల రద్దు నిర్ణయం. అయితే డీమానిటైజేషన్ నిర్ణయానికి మెజారిటీ ప్రజల మద్దతు ఉందని, భవిష్యత్తులో ఖచ్ఛితంగా సత్ఫలితాలను ఇస్తుందని అంటున్నాడు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా. అవినీతి, నల్లధనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ సరైందే అని ఆయన అంటున్నాడు.

అయితే ఇది ఇక్కడితో అయిపోలేదని అసలు సినిమా ముందుందని చెబుతున్నాడు. త్వరలోనే మరిన్న కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. పన్ను రేట్లను తగ్గించడం, లేదా సరళీకరించడం, నల్లధనాన్న జనాలు పోగేసుకోకుండా నిరుత్సాహపరిచే పలు విధానాలు అమల్లోకి వస్తాయన్నాడు. నల్లధనంతో ఎవరైనా దొరికితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం నల్లధనంపై ముఖాముఖి పోరు అని చెప్పాడు.

నల్ల కుబేరులు ఖచ్ఛితంగా శిక్షించబడతారని తెలిపిన ఆయన గత ప్రభుత్వాలేవీ చేయని ధైర్యాన్ని మోదీ చేశారన్నారు. ఏదైతేనేం ఆర్థిక వేత్తలు కాదంటున్నా నోట్ల రద్దు నిర్ణయం సరైందన్న అభిప్రాయాన్నే ఆయన వ్యక్తం చేశాడు. రానున్న ఆర్థిక సంవత్సరంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetization  PM Narendra Modi  NITI Ayog  vice-chairman Arvind Panagariya  

Other Articles