త్వరలో ఇళ్లు కట్టిచూడు.. వాహనం కోని చూడు parking space proof may be mandatory for vehicle registration

Parking space proof may be mandatory for vehicle registration

demonitization, old notes ban, Parking space proof, vehicle registration, parking space availability certificate, Venkaiah Naidu, Google toilet locator, Delhi, Union Urban Development Minister

In future, it would be mandated (that) no permission would be given to any construction without a toilet…no car or vehicle should be registered without adequate parking space availability certificate

త్వరలో ఇళ్లు కట్టిచూడు.. వాహనం కొని చూడు..

Posted: 12/22/2016 09:38 PM IST
Parking space proof may be mandatory for vehicle registration

అవునండీ త్వరలో ఇల్లు కట్టి చూడు.. వాహనం కొని చూడురా బాబు.. అనే డైలాగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది.. అదేంటి ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న డైలాగ్ కదా ఫేమస్ అంటారా..? కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పెద్దనోట్ల రద్దు చారిత్రక నిర్ణయంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు అనేక తంటాలు పడుతూనే వున్నారు. ఈ క్రమంలో ఆ డైలాగ్ అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది.

కేంద్రం అమలుపరుస్తున్న డిమానిటైజైషన్ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై, తన ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అగ్రహంతో వున్నారని, అయితే తాము తీసుకువచ్చిన మార్పులతో రానున్న రోజుల్లో వారే తనను మెచ్చుకుంటారని ప్రధాని ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కార్యక్రమంలో పాల్గోన్న అన్నారు. ఈ క్రమంలో ప్రజాగ్రహం గురించి ప్రధానికి తెలిసిందని సంతోషించాలో.. లేక అదే క్రమంలో కేంద్రం మరో నిర్ణయంతో ముందుకు వెళ్తుందని ఇది ఎటు దారితీస్తుందని బాధపడాలే అర్థంకాని పరిస్థితి నెలకొంది. అదేంటి అంటారా..?

గతంలోలా డ్రైవింగ్ వచ్చిందని,  లైసెన్స్ ఉందని బైక్ కొనుగోలు చేద్దామంటే కుదరదు....లేకపోతే.. ఇంటి స్థలం వుంది, చేతిలో డబ్బు కూడా వచ్చిందంటేనూ కుదరదు.. బైక్ కొనాలన్నా.. కారు కొనాలన్నా ఇకపై పార్కింగ్ స్థలం వుందని సర్టిఫికేట్ చూపించాలి. ఇక ఇల్లు నిర్మించాలంటే కూడా ఇంట్లో టాయిలెట్లకు స్థలాన్ని కేటాయించాల్సిందే. లేని పక్షంలో వాహనాలు కొనుగోళ్లతో పాటు ఇంటి నిర్మాణాలు జరగకపోవచ్చు. ఈ మేరకు దృవీకరణ పత్రాలను అధికారులను చూపిస్తేనే ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ లేదా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి లభిస్తుందని కేంద్రమం పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కోన్నారు.

అంతకుముందు వెంకయ్యనాయుడు ‘గూగుల్ టాయిలెట్ లొకేటర్‌’ను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయమై రవాణా మంత్రిత్వ శాఖతో తన శాఖ చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇక టాయిలెట్ లోకేటర్ ద్వారా ప్రజలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ప్రజలు సమీపంలోని టాయిలెట్లను వెదికే వీలుంటుంది. గూగుల్ టాయిలెట్ లొకేటర్‌లో ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, బస్, రైలు స్టేషన్లు, పెట్రోలు పంపులు, మెట్రో స్టేషన్లలో ఉన్న 6,200 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parking space  proof  vehicle registration  Venkaiah Naidu  toilets  house construction  

Other Articles