సిద్ధార్థ్ నాథ్ జీ... మీ హితబోధ నాకు కాదు.. మీ నేతలకే అవసరం | pawan counter tweet to BJP.

Pawan counter to siddarth nath singh comments

Pawan kalyan Siddharth Nath Singh, Siddharth Nath Singh Pawan Kalyan, Janasena pawan Kalyan, Pawan kalyan BJP, BJP Janasena, Janasena Pawan kalyan, Pawan kalyan tweets, Janasena versus BJP, siddarth nath singh comments on Pawan kalyan

Pawan kalyan reply to BJP’s AP Incharge Siddharth Nath Singh.

మీ సుద్దులు నాకు అక్కర్లేదు: బీజేపీకి పవన్ కౌంటర్

Posted: 12/21/2016 04:32 PM IST
Pawan counter to siddarth nath singh comments

నోట్ల రద్దుపై నిర్ణయంపై అగ్రనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విరుపుల మాటల(ట్వీట్ల) పై బీజేపీ అధిష్టానం ఎదురు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఏపీ ఇన్ ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పవన్ ను ఉద్దేశించి కౌంటర్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పవన్ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

'రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన మీ పార్టీ ఇంత ఘోర తప్పుడు నిర్ణయాన్ని ఎలా తీసుకుందో వివరించండి' అంటూ పవన్ కళ్యాణ్ సూటిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ నే ప్రశ్నించాడు. మీ నిర్ణయాల వల్ల ఏ తప్పు చేయని అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, మీ హిత బోధలు నాకు అవసరం లేదని ఆయన సూటిగా చెప్పారు. 'మీ బోధలేవైనా ఉంటే మీ పార్టీ వాళ్లకు చెప్పుకోండి' అని సిద్ధార్థ్ నాథ్ సింగ్ కు గట్టి కౌంటరే ఇచ్చాడు.

కాగా, పరిణిత రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించటం తెలిసిందే. విమర్శలు ప్రజాస్వామ్య దేశంలో అంగీకారమే అయినప్పటికీ, అవి వాస్తవానికి దగ్గర ఉండాలంటూ ఆయన పవన్ కి సూచించాడు. ఇక నోట్ల రద్దుతో బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా మిత్రపక్షాలను దూరం చేసుకోవటం ప్రారంభిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles