అమ్మ స్థానం చిన్నమ్మతో భర్తీ.. మోకరిల్లుతున్న పార్టీ నేతలు AIADMK wants Sasikala to become chief minister, contest bypolls

Aiadmk wants sasikala to become chief minister contest bypolls

AIADMK, General Secretary, VK Sasikala, Bypolls, RK Nagar, Tamil Nadu, Chief Minister, Revenue Minister, RB Udhayakumar, resolution

While AIADMK is urging VK Sasikala to become AIADMK's General Secretary, ministers from the party are now also pushing her to contest the bypolls and become the chief minister of Tamil Nadu.

అమ్మ స్థానం చిన్నమ్మతో భర్తీ.. ఉపఎన్నికలలో పోటీ చేయాలంటున్న నేతలు

Posted: 12/19/2016 09:47 AM IST
Aiadmk wants sasikala to become chief minister contest bypolls

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వారు ప్రేమతో పిలుచుకునే అమ్మ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనంతవాయువులలో ఐక్యమై పక్షం రోజులు పూర్తికాకుండానే తమకు అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ అంటూ జయలలితకు బదులు శశికళ నామ జపం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీలో కూడా ముసలం పుట్టే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.

తమిళనాడు రివెన్యూ శాఖ మంత్రి ఉదయ్ కుమార్ నేతృత్వంలోని సీనియర్ నాయకుల బృందం వెళ్లి చిన్నమ్మ శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారు. అంతేకాదు జయలలిత పోటీ చేసిన అర్కేనగర్ నియోజకవర్గం నుంవి కూడా ఉప ఎన్నికల బరిలో నిలవాలని వారు కోరారు.  'తాయి తంట వరం' (అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ) అనే శీర్షికతో ఉన్న తీర్మానం కాపీని శశికళకు అందించారు. దీంతో ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాల్లో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు కూడా వెలిశాయి.
 
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవితో ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కాపాడాల్సింది చిన్నమ్మను కోరామని రాధాకృష్ణన్ చెప్పారు. వీళ్లతో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారు. జయలలిత నింసించిన పోయెస్‌ గార్డెన్స్ భవనంలోనే ఇప్పుడు శశికళ కూడా ఉంటున్నారు. ఆ భవనానికి ఇటీవలి కాలంలో సందర్శకుల రాకపోకలు వెల్లువెత్తుతున్నాయి.

మొదట్లో... ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్లు శశికళను వ్యతిరేకించినట్లు కథనాలు వచ్చినా.. తర్వాత ఏమైందో గానీ వాళ్లు కూడా సమాధాన పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అన్నాడీఎంకేలోని ఏ ఒక్కరూ శశికళను బహిరంగంగా వ్యతిరేకించలేదు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టిన పన్నీరు సెల్వం వర్గం మాత్రం ఈ పరిణామాలపై కొంత స్థబ్దుగా వుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles