కేబీఎస్ బ్యాంకు సిఈఓపై కాల్పులు.. తెలిసిన వ్యక్తుల పనేనా..? KBS bank CEO shot in Hyderabad

Man fires at kbs bank ceo inside his residence in hyderabad

KBS bank, Hyderabad, Bank CEO shot in Hyderabad, Masab Tank, gunfire, unidentified man shoots CEO, Manmath Dalai

Manmath Dalai, Chief Executive Officer (CEO) of Krishna Bhima Samruddhi Local Area Bank (KBS) was fired at by an unknown person, who posing as a policeman entered his apartment,

కేబీఎస్ బ్యాంకు సిఈఓపై కాల్పులు.. తెలిసిన వ్యక్తుల పనేనా..?

Posted: 12/19/2016 10:17 AM IST
Man fires at kbs bank ceo inside his residence in hyderabad

హైదరాబాద్‌లో మరోమారు రేగిన కాల్పులు కలకలం పలు అనుమానాలకు తావిస్తుంది. బ్యాంకు గురించి సమస్త సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి దుండగుడిని ఉపిగోల్పివుంటారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దుండగుడు నేరుగా మాసాబ్ ట్యాంక్ లోని మన్మథ్ దలై నివాసముంటున్న అపార్టుమంటుకు చేరుకోవడం.. సరిగ్గా ఆయన నడిపే కారును చూపించి.. ఆయన ప్లాట్ లోకి వెళ్లాలని కోరడం అంతా పరిశీలించిన పక్షంలో దుండగుడు పలుమార్లు అయనను అడ్డుకునేందుకు ప్లాట్ లో కాకుండా బయట కూడా రెక్కీ నిర్వహించినట్లే వున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేనును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు బ్యాంకు సిబ్బంది సహా, సీఈఓ పరిచయస్తులపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో ఓ ప్రైవేటు బ్యాంక్‌ సీఈఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు దోపిడీకి యత్నించాడు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 19 బ్రాంచులున్న కృష్ణ బీమా సమృద్ధి బ్యాంకు(కేబీఎస్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అయిన మన్మథ్ దలై(60)పై దుండగుడు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. మాసబ్‌ట్యాంకులో ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి కాల్పుల్లో ఓ తూటా మన్మతదలై మోకాలి కిందభాగంలోకి దూసుకుపోయింది. కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మాసబ్‌ట్యాంకులోని శాంతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోని 101 ప్లాట్‌లో మన్మతదలై ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు(30) వచ్చి  సెక్యూరిటీ గార్డుతో సార్‌ను కలవాలని చెప్పాడు. సార్‌పైన ఉన్నారని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్లాడు. మన్మతదలైని కలిసిన యువకుడు తనకు డబ్బు, బంగారం కావాలంటూ హిందీలో డిమాండ్ చేశాడు. బెడ్‌రూంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న మన్మతదలైపై కాల్పులు జరిపాడు. మోకాలిలోకి తూటా దూసుకెళ్లడంతో కుప్పకూలిన ఆయన కేకలు వేశారు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీగార్డును ఆగంతుకుడు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మన్మతదలైని స్థానికులు కేర్ ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles