పగ్గాలు చేపట్టకుండానే చైనాపై ట్రంప్ గరం.. గరం.. Trump Says US Should Refuse to Take Back Drone Seized By China

Trump says us should refuse to take back drone seized by china

Politics, China, United States, Donald Trump, US: News, Wars and Military Conflicts, Politics, business news

President-elect Donald Trump continued to use social media to poke at China, saying on Twitter that the U.S. should refuse to take a drone seized in international waters after the Communist country agreed to return it.

పగ్గాలు చేపట్టకుండానే చైనాపై ట్రంప్ గరం.. గరం..

Posted: 12/19/2016 09:40 AM IST
Trump says us should refuse to take back drone seized by china

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా అధికార పగ్గాలు అందుకోకుండానే చైనాపై తన వైఖరిని మరోసారి చాటుకున్నారు. అంతర్జాతీయంగా దేశాల మధ్య సయోద్య నెలకొనాల్సిన సమయంలో చైనా చేసిన పనులు అయనకు అగ్రహాన్ని తెప్పించడంతో ఆయన కమ్యూనిస్టు దేశంపై విరుచుకుపడ్డారు. అమెరికా నేవీకి చెందిన డ్రోన్‌ను చైనా దొంగలించిందని, దానిని చైనా ఉంచేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికా నేవీ ఓషనోగ్రాఫీ (సముద్ర అధ్యయన) డ్రోన్‌ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నానని,  ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చైనా చెప్తుండగా.. ఆ దేశం తీరుపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైనా అమెరికా డ్రోన్ ను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన నేపథ్యంలో దానిని మీరే వుంచుకోండని ట్రంప్ నిర్మోహమాటంగా చెప్పారు. అమెరికా బలగాలు కూడా చైనా తిరగిచ్చే ద్రోణిని తీసుకోవద్దని కోరారు. అయితే దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన చైనాను ప్రశ్నించారు.

‘మీరు దొంగలించిన డ్రోన్‌ మాకు ఏమీ వద్దని మేం చైనాకు చెప్పదలుచుకున్నాం. దానిని మీరే ఉంచుకోండి’ అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అపారమైన వనరులున్న దక్షిణ చైనా సముద్రం మొత్తం గంపగుత్తగా తనదేనని, ఇందులో ఇతర దేశాలకు ఏమాత్రం హక్కులేదని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్‌ను చైనా చెప్పాపెట్టకుండా స్వాధీనం చేసుకుంది. తమ డ్రోన్‌ను ఇలా స్వాధీనం చేసుకోవడం అక్రమమని అమెరికా వాపోతున్నది. ట్రంప్‌ గతంలోనూ చైనా తీరుపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  United States  Donald Trump  Wars and Military Conflicts  Donald Trump  China  Drone  

Other Articles