పెద్దనోట్ల రద్దు.. ఇందిర ఇండియాను అమ్మెశారు: మోడీ Demonetisation should have been done in 1971: Modi

Indira gandhi ignored advice to demonetise sold out india pm

demonetisation, narendra modi, Wanchoo committee, Indira Gandhi, BJP parliamentary meet, demonetisation woos

PM Modi levelled charges against two former premiers, his predecessor Dr Manmohan Singh and Indira Gandhi, of ignoring basic steps to fight corruption.

మాజీ ప్రధానిపై మోడీ సంచలన అరోపణలు

Posted: 12/16/2016 09:21 PM IST
Indira gandhi ignored advice to demonetise sold out india pm

పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని మోదీ బిగ్ కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తాను మాట్లాడితే భూమి కంపిస్తుందన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అరోపణల నేపథ్యంలో ప్రధాని ఇవాళ జరిగిన బీజేపి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా మాజీ ప్రధాని ఇంధిరాగాంధీని టార్గెట్ చేశారు. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని వాంచో కమిటీ 1971లోనే ఇందిరాగాంధీకి సిఫార్సు చేశారని పేర్కొన్నారు. కానీ ఆ రిపోర్టును ఇందిరాగాంధీనే తొక్కేసి దేశాన్ని అమ్ముకున్నారని మోడీ సంచలన అరోపణలు చేశారు.

దేశం నుంచి అవినీతి పారద్రోలేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడం వంటి నిర్ణయాలను ఎందుకు తీసుకోలేకపోయారని ఆయన కాంగ్రెస్ కు చెందిన మాజీ ప్రధానులు ఇంధిరాగాంధీ సహా అర్థిక రంగణ నిష్ణాతుడు మన్మోహన్ సింగ్ ను నిలదీశాడు. కాంగ్రెస్ పార్టీకి దేశమంటే రాజకీయాలు అందునా కాంగ్రెస్ పార్టీకే ప్రాధన్యమిస్తుందని విమర్శించిన ఆయన తమకు దేశ అంటేనే సుప్రీం అని పార్టీకి పెద్దగా తాము ప్రాధన్యమవ్వమని కూడా చెప్పారు.

దేశంతో పాటు దేశ ప్రజలకు ప్రాధాన్యత వుంటుందని అన్నారు. బ్లాక్మనీ నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించుకుని లక్ష్యాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఇవాళ అధికార పార్టీ నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే... అవినీతిపై గొంతెత్తాల్సిన ప్రతిపక్షాలు తీరు మాత్రం మరోలా ఉందన్నారు.  

బీజేపీ పార్లమెంటరీ మీట్ లో ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాలు 2జీ, కోల్గేట్ స్కాం వంటి కుంభకోణాల్లో కూరుకుపోగా.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాయని, కానీ ఇప్పుడు నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చాలా విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. డిజిటల్ ఎకానమీ ఒక జీవన విధానంగా ఉండాలని, అప్పుడే ఆర్థికవ్యవస్థలో పారదర్శకత తీసుకురాగలుగుతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల వాడకంపై ప్రజల్లో ప్రోత్సాహం తేవాలని మోదీ హితబోధ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  narendra modi  Wanchoo committee  Indira Gandhi  BJP parliamentary meet  

Other Articles