విశ్వమంతా విషవాయువే.. మనం పీల్చుతున్నదేంటీ..? Watch the Earth Breathe in Stunning 3-D

Watch the earth breathe in stunning 3 d

carbon dioxide, David crisp, hubble space telescope, greenhouse gas, oxygen, planet-warming, global warming, climate change, air pollution, weather satellites, nasa, jet propulsion laboratory

Seeing CO2 from space marks a major advance, says NASA Jet Propulsion Laboratory scientist David Crisp, the science team leader for OCO-2.

ITEMVIDEOS: విశ్వమంతా విషవాయువే.. మనం పీల్చుతున్నదేంటీ..?

Posted: 12/16/2016 09:17 PM IST
Watch the earth breathe in stunning 3 d

విశ్వమంతా విషవాయువే.. మరి మనం పీల్చుతున్నదేంటీ..? అని అలోచించే వాళ్లు ఎవరైనా సామాన్య ప్రజలల్లోకి వారితో ఇదే అంశంపై ముచ్చటిస్తే.. ఖచ్చితంగా పిచ్చోడని ముద్ర వేసుకోక తప్పదు. కానీ నిజం నిష్టూరంగా వుంటుందన్నట్లు అ సందేహాలు ఉత్పన్నమైన ప్రతీసారి భూగోళంపైనున్న జీవులు పరిస్థితేమిటీ అన్న అనుమానాలు కలుగుతుంటాయి. ఒక్క చెట్లు, మొక్కలు మినహా అన్ని జీవరాసులకు ప్రాణాధారమైన ప్రాణవాయువు అక్సిజన్ అన్నడంలో సందేహం లేదు.

అయితే భూమిపై ఎంతమొత్తంలో ప్రాణావాయువు వుంది. వాయువులో మిలితమై ఎంతమేర విషవాయువులు జీవరాసులపై ప్రబావాన్ని చూపుతున్నాయని ప్రశ్నించుకుంటే వెంటనే గుర్తుకు వచ్చేది గ్లోబల్ వార్మింగ్. సకల చరాచర జీవరాసులన్నీ వాటి పని అవి చేసుకుంటూ సమత్యులత కోసం పాటుపడుతుంటే.. లోకజ్ఞానం వున్న మనిషి మాత్రం వినాశనం దిశగా వెళ్తూ అభివృద్ది మంత్రాన్ని జమిస్తున్నాడు. తనతో పాటు అన్ని జీవరాశులు ఉనికికి ప్రమాదం అంచున నిలుపుతున్నాడు.

తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన ఈ త్రీడీ వీడియో.. అందులో విషయం తెలిస్తే మాత్రం కొంచెం డీలా పడటం ఖాయం. పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాలను మండించడం, అడవులను విచ్చల విడిగా నరికేయడం వంటి అనేకానేక చర్యల వల్ల భూమి వేడెక్కుతోందని, దానివల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తాయని మీరూ వినే ఉంటారు. ఈ విపత్తుకు కారణమైన విషవాయువు అదేనండి.. కార్బన్‌డైయాక్సైడ్‌ భూ వాతావరణంలో ఎలా విస్తరిస్తుందో చూపుతుంది ఈ వీడియో.

ధ్రువ ప్రాంతాల్లోని నీలాల రంగు వాతావరణంలో తక్కువ మోతాదులో కార్బన్‌ డై యాక్సైడ్‌ ఉన్న విషయాన్ని సూచిస్తూంటే.. జనావాసాలు ఉన్న చోట కనిపించే పసుపు, నారింజ, ఎరుపు రంగులు ఈ వాయువు మనకు ముప్పు తెచ్చే స్థాయిలో ఉన్న విషయాన్ని చెబుతోంది. ఆర్బిటింగ్‌ కార్బన్‌ అబ్జర్వేటరీ -2 శాటిలైట్‌ ద్వారా 2014 నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి సిద్ధమైంది ఈ వీడియో. ఇటీవలే విడుదలైన ఈ వీడియో ఇప్పటికే నెట్‌లో వైరల్‌ స్థాయికి చేరుకుంది. మహా సముద్రాలు, చెట్టూ చేమ వీలైనంత పీల్చేసుకున్న తరువాత కూడా వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డైయాక్సైడ్‌ వాయువులు ఉండటం శాస్త్రవేత్తల్లోనే కాదు... ప్రజలందరినీ అందోళనకు గురిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : climate change  air pollution  weather satellites  nasa  jet propulsion laboratory  

Other Articles